Breaking News

04/05/2019

పోస్టల్ బ్యాలెట్ ఉద్యోగులకు సౌకర్యం

జగిత్యాల  04 (way2newstv.in)
జిల్లా మండల పరిషత్ ఎన్నికల్లో పోలింగ్ విధుల్లో పాల్గొనే ఉద్యోగులు ఉపాధ్యాయులకు ఎన్నికల కమిషన్ పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించింది సార్వత్రిక ఎన్నికల మాదిరిగానే ప్రస్తుతం జరిగే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు పోస్టల్ బ్యాలెట్ విధానంపై తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సర్వీసుల సంఘం జగిత్యాల జిల్లా గౌరవాధ్యక్షులు హరి అశోక్ కుమార్ సమాచారార్థం వివరించడం జరిగింది ఎన్నికలు జరగడానికి ఐదుఆరు రోజుల ముందు నుంచే ఉద్యోగులు, ఉపాధ్యాయులు తమ ఓటు హక్కు వినియోగానికై పోస్టల్ బ్యాలెట్ కోసం దరఖాస్తు చేసుకునే వీలుందని దరఖాస్తులు పొందిన ఉద్యోగులు, ఉపాధ్యాయులకు అధికారులకు ఓట్ల లెక్కింపు రోజున ప్రారంభం వరకు ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఎన్నికల కమిషన్ అవకాశం ఇచ్చింది. 


పోస్టల్ బ్యాలెట్ ఉద్యోగులకు సౌకర్యం

పరిషత్ స్థాయిలో ఈపోస్టల్ బ్యాలెట్ ను రిటర్నింగ్ అధికారి జారీ చేస్తారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఫారం నెంబర్ 14 పొందాలి. ఈఫారంతొ పాటు ఓటరు గుర్తింపు పత్రం క్రమసంఖ్య ,గ్రామము, వార్డు ఎన్నికల విధుల ధ్రువీపత్రం సంబంధిత రిటర్నింగ్ అధికారికి అందజేయాలి. ప్రభుత్వ శాఖల్లో పనిచేసే ఉద్యోగాలతోపాటు, ఆర్మీ రక్షణ రంగాల్లో సేవలందిస్తున్న వారు కూడా పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకునే వీలుందని హరి అశోక్ కుమార్ వెల్లడించారు

No comments:

Post a Comment