రంగారెడ్డి మే 04 (way2newstv.in)
రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం లో టీఆర్ఎస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారం లో మాజీ మంత్రి మహేందర్ రెడ్డి, జెడ్పీటీసీ అభ్యర్థి పట్నం అవినాష్ రెడ్డి పాల్గోన్నారు. శనివారం నాడు కుమ్మరి గూడ, ముద్దెంగూడ గ్రామాల్లో భారీ ర్యాలీ లతో పార్టీ శ్రేణులు వారికి స్వాగతం పలికాయి.
షాబాద్ లో మహేందర్ రెడ్డి ప్రచారం
మహేందర్ రెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి రంగారెడ్డి తో పాటు రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల లో టీఆర్ఎస్ పార్టీ మరో మారు ఘన విజయం సాదిస్తూ అన్ని జిల్లా పరిషత్ లు, ఎంపీపీ లను కైవశం చేసుకుంటుంది. వినూత్న పథకాలు, అభివృద్ధి, సంక్షేమానికి కేర్ఆఫ్ అడ్రస్ గా తెలంగాణ రాష్ట్రం నిలిచేలా సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అడ్రస్ పూర్తిగా గల్లంతవుతుంది. కారు గుర్తుకు ఓటు వేసి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని మహేందర్ రెడ్డి కోరారు.
No comments:
Post a Comment