Breaking News

04/05/2019

వారం రోజులలో సెలెక్ట్ అయిన టీచర్లకు పోస్టింగ్స్ ఇవ్వాలి

ఇవ్వకపోతే జాతీయ మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు
హైదరాబాద్ మే 4 (way2newstv.in)
;పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా సెలెక్ట్ అయిన 8792 టీచర్లకు వారం రోజులలో పోస్టింగ్స్ ఇవ్వకపోతే జాతీయ మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేయాలని రాష్ట్ర సెలెక్టెడ్ టీచర్ల సంఘం సమావేశమై నిర్ణయం తీసుకుంది. అలాగే ఎస్సి, ఎస్టి, సి – రిజర్వేషన్ కేటగిరి అభ్యర్థుల అభివృద్ధికి – ప్రయోజనాలకు అవరోధంగా మారినందున జాతీయ ఎస్సి కమీషన్ కు, జాతీయ బి.సి కమీషన్ కు కూడా పిర్యాదు చేయాలనీ నిర్ణయించారు. ఈ రోజు హైదరాబాదులోని బీసీ భవన్ లో జరిగిన సెలెక్టెడ్ టీచర్ల సమావేశంలో ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ సెలెక్ట్ అయిన టీచర్లకు ఉద్యోగాలు ఇవ్వడానికి ప్రభుత్వానికి గల అవరోధాలు ఏమిటని ప్రశ్నించారు? ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తోందని విమర్శించారు. పోస్టింగ్స్ లో జాప్యం చేయడం మూలంగా నెలకు 100 కోట్ల బడ్జెట్ మిగుల్చుకోవాలనే కుట్రతో జాప్యం చేస్తున్నారని విమర్శించారు. 


వారం రోజులలో సెలెక్ట్ అయిన టీచర్లకు పోస్టింగ్స్ ఇవ్వాలి

ఈ సమావేశానికి గుజ్జ కృష్ణ అద్యక్షత వహించారు.అనేక వివాదాల మధ్య ఆరు నెలల క్రితం సర్టిఫికెట్లు వెరిఫికేషన్ చేసి ఫైనల్ సెలెక్టెడ్ టీచర్ల జాబితాను విద్యాశాఖ అధికారులకు పంపారు. గత ఆరు నెలలుగా ముఖ్యమంత్రి పేషిలో ఈ ఫైలును పెండింగ్ లో ఉంది. ముఖ్యమంత్రి ఈ ఫైళ్లను చూడడం లేదు. దీనితో సెలెక్ట్ అయిన వేలాది మంది నిరుద్యోగులు, వారి కుటుంబాలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నాయి. సెలెక్ట్ అయిన టీచర్లు తమకు పోస్టింగ్లు ఇవ్వాలని ధర్నాలు చేసిన, విద్యా శాఖ కమిషనర్ కార్యాలయం ముట్టడి చేసి చేశారు. కానీ ప్రభుత్వం స్పందించడం లేదు.ఆర్.కృష్ణయ్య ప్రసంగిస్తూ టిచర్ పోస్టుల భర్తీకి ఎన్నికల్ కోడ్ అవరోధం కూడా కాదన్నారు. ఎందుకంటే ఇదే ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సందర్భంలో ఈసీ  నుండి అనుమతి తీసుకొని  9355 మంది జూనియర్ పంచాయతీ కార్యదర్శులను, అలాగే సోషల్ వెల్ఫేర్ లో 3,200 మంది  గురుకుల ఉపాధ్యయులకు పోస్టింగ్ ఆర్డర్ ఇచ్చారు. అలాంటప్పుడు కేవలం ప్రభుత్వ పాఠశాలలో పేద పిల్లలకు చదువు చెప్పే ఉద్యోగ ఉపాధ్యాయుల విషయంలో ఎన్నికల కోడ్ ఎలా అడ్డువస్తుందన్నారు. పైగా ఇది గతంలో జారీచేసిన నోటిఫికేషన్ కాబట్టి ఎన్నికల కోడ్ వర్తించదన్నారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ కి అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వహించకుండా ప్రభుత్వానికి తొత్తులుగా మారిందని విమర్శించారు. పోస్టింగ్ ఇవ్వాలని ఉద్యమాలు చేసే వారిని భయ భ్రాంతులాకు గురిచేస్తున్నారన్నారు. వారి వెనకాల ఉండి పోరాడేవారిని, నిరుద్యోగులను బెదిరిస్తున్నారు. ఒక రాజ్యాంగ బద్దమైన పబ్లిక్ సర్వీస్ కమీషన్ అధికారులు, పౌరులకు రాజ్యాంగ బద్దంగా సంక్రమించిన ప్రాథమిక హక్కులను కాలరాయడం తగునాయని ప్రశ్నించారు.గత 9 సంవత్సరాలుగా టీచర్ పోస్టులు భర్తీ చేయకపోవడంతో ప్రభుత్వ పాఠశాలలో విద్యా ప్రమాణాలు దెబ్బతింటున్నాయి. 4600 ప్రభుత్వ  పాటశాలలు మూతపడ్డాయి. ప్రభుత్వ పాఠశాలలో టీచర్లు లేకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో టి.సిలు తీసుకొని ప్రైవేటు పాఠశాలల్లో చేర్పిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్ పోస్టులు భర్తీ చేయకపోతే నష్టపోయేది ఎస్సీ,ఎస్టీ, బీసీ విద్యార్థులు. ఫీజులు కట్టె స్తోమత లేక చాలామంది  చదువు  మానుకుంటున్నారు. ఇంకొక వైపు బీ.ఈ.డీ – డీ.ఈ.డీ పూర్తి చేసిన వారు, టిఇటి  పాసైన వారు  5 లక్షల మంది ఉద్యోగాలు లేక రోడ్ల వెంబడి తిరిగి తమ శక్తియుక్తులు వృధా చేసుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితులలో ఇప్పటికైనా వెంటనే సెలెక్ట్ అయిన 8792 మందికి పోస్టింగ్స్  ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.  రాష్ట్ర ప్రభుత్వం టీచింగ్ స్టాఫ్ ను నియమించకుండ విద్యావ్యవస్థను బ్రష్టు పట్టిస్తుoదన్నారు. ఈ రోజు ఇంటర్ పరిక్ష ఫలితాలలో ఇంట గందరగోళం జరుగడానికి సరియైన అధ్యాపకులు లేకపోవడం ప్రధాన కారణం. ఇంటర్ పరీక్షా ఫలితాలలో అవకతవకలు జరగడానికి 23 మంది విద్యార్థులు ఆత్మహత్యలకు ప్రధాన కారణం, పరీక్ష పత్రాలు వాల్యుయేషన్ చేయడానికి జూనియర్ లెక్చరర్లు లేక బయటి వ్యక్తులతో, విద్యార్హతలు లేని వారితో పరిక్ష పేపర్లు వాల్యూయేషన్ చేయించారు. పేపర్లు దిద్దించారు. దాదాపు 70 శాతం అనగా ఆరు వేల జూనియర్ లెక్చరర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీనితో విద్యార్హతలు లేని వారితో పేపర్స్ వాల్యుయేషన్ చేయించారు. అలాగే ఎస్ఎస్సి పేపర్లు వాల్యుయేషన్ చేయడానికి టీచర్లు లేక జాప్యం జరుగుతోందన్నారు. దాదాపు 50 వేల టిచర్ పోస్టులు ఖాళీగా ఉన్నవి. రాజ్యాంగo ప్రకారం విద్యా, వైద్యం ప్రభుత్వం భాద్యతయన్నారు. అందుకే ఖాళీగా ఉన్న లెక్చరర్, టిచర్ పోస్టులు భర్తీ చేయాలన్నారు.

No comments:

Post a Comment