Breaking News

21/05/2019

మున్సిపాల్టీ ఎన్నికలకు పార్టీలు సిద్ధం


శ్రీకాకుళం, మే 21, (way2newstv.in)
మున్సిపల్‌ ఎన్నికల పోరే. ఇందుకోసం ఓటర్ల జాబితాల ప్రచురణ ఇప్పటికే పూర్తికావడంతో తదుపరి చర్యల్లో పురపాలక అధికారులు సన్నద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా కులాల వారీగా ఓటర్ల గుర్తింపు, జనరల్, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మహిళల ఓటర్ల శాతాల ప్రకారం వార్డుల్లో రిజర్వేషన్ల ప్రక్రియ, పోలింగ్‌ కేంద్రాల ఏర్పాట్లు తదితర చర్యలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. రానున్న పురపోరులో బలాబలాలు తేల్చుకునేందుకు జిల్లాలో ప్రధానంగా వైఎస్సార్‌సీపీ, టీడీపీ సన్నద్ధమవుతున్నాయి.ఇందుకోసం ధీటైన అభ్యర్థులను సన్నద్ధం చేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపులో కీలకమైన కార్యకర్తల సేవను గుర్తించాలని అధిష్టానం నిర్ణయించడంతో వారిలో కొత్త ఉత్సాహం కన్పిస్తోంది.గత స్థానిక, సార్వత్రిక ఎన్నికల్లో ప్రభావం చూపిన టీడీపీ ఈసారి మాత్రం కంగుతిననుంది.మరోవైపు జిల్లాలో శ్రీకాకుళం కార్పొరేషన్‌తోపాటు ఆమదాలవలస, ఇచ్ఛాపురం, పలాస, పాలకొండ మున్సిపాలిటీల్లో ప్రధాన పార్టీలైన వైఎస్సార్‌సీపీ, తెలుగుదేశం పార్టీ మళ్లీ యుద్ధానికి సన్నద్ధమవుతున్నాయి.జిల్లా కేంద్రమైన శ్రీకాకుళం మున్సిపాలిటీని 2015లో కార్పొరేషన్‌ హోదాను, అలాగే రాజాం మేజర్‌ పంచాయతీని 2005లో నగర పంచాయతీగా హోదాను కల్పించినప్పటికీ, ఇప్పటివరకు ఎన్నికలు నిర్వహించలేదు. 



మున్సిపాల్టీ  ఎన్నికలకు పార్టీలు సిద్ధం

గత పుర ఎన్నికల్లో ఇచ్ఛాపురం, ఆమదాలవలస, పాలకొండ, పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీల్లో పాలక సభ్యుల పాలన కొనసాగుతోంది. వచ్చే జూలై వరకు ఈ పాలనకు గడువుంది. అయితే శ్రీకాకుళం కార్పొరేషన్‌లో విలీన వివాదాలకు ఫుల్‌స్టాప్‌ పడటంతో ఈసారి తొలిసారిగా ఎన్నికలకు ముస్తాబవుతోంది. వాస్తవానికి శ్రీకాకుళం పట్టణానికి 3 లక్షల మంది జనాభా ఉంటేనే కార్పొరేషన్‌ హోదా ఇవ్వాల్సి ఉంది. అయితే పట్టణానికి సమీపంలో కాజీపేట, కిల్లిపాలెం, చాపురం, పాత్రునివలస, పెద్దపాడు, తోటపాలం, కుశాలపురం పంచాయతీలను విలీనం చేస్తారని అంతా భావించారు.ఇవి విలీనం చేసినా.. ఇప్పుడున్న 1.25లక్షల మంది జనాభాకు మరో 80 వేల నుంచి లక్ష మంది వరకు జనాభా పెరిగే అవకాశముంది. అయితే తాజాగా పరిస్థితులు చూస్తుంటే విలీన ప్రతిపాదనలకు ఫుల్‌స్టాప్‌ పెట్టినట్లుగా కన్పిస్తోంది. పైగా ఎన్నికల సంఘం అధికారులు కూడా కేవలం కార్పొరేషన్‌ పరిధిలోని 50 డివిజన్లలో ఓటర్ల జాబితాలను మాత్రమే పరిగణనలోకి తీసుకుని ప్రచురణ చేయాల్సిందిగా ఆదేశించిన సంగతి తెలిసిందే. అలాగే మరోవైపు ఈ నెల 20న జిల్లాలో 1143 పంచాయతీల్లోనూ వార్డుల వారీగా ఓటర్ల జాబితాలను ప్రచురణ చేయనున్నారు. ఇందులో విలీన ప్రతిపాదనలో ఉన్న ఈ ఏడు పంచాయతీల్లో కూడా వార్డుల వారీగా ఓటర్ల జాబితాలను ప్రచురణ చేయనున్నారు. దీంతో ఈసారికి విలీన ప్రతిపాదనలు లేనట్లే అన్న భావన వ్యక్తమవుతోంది.జిల్లాలో ప్రముఖ వ్యాపార, వాణిజ్య పట్టణమైన రాజాం నగర పంచాయతీకి ఈ దఫా కూడా ఎన్నికలు లేనట్లే అని తేలిపోయింది. రాష్ట్ర ఎన్నికల సంఘ అధికారుల ఆదేశాల మేరకు రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఎన్నికల నిర్వహణకు ఆయా విభాగాల అధికారులు చర్యలకు దిగారు. ఈ మేరకు జిల్లాలో శ్రీకాకుళం కార్పొరేషన్‌తోపాటు ఆమదాలవలస, ఇచ్ఛాపురం, పలాస–కాశీబుగ్గ, పాలకొండ మున్సిపాలిటీల్లో ఓటర్ల జాబితాల ప్రచురణ పనులు పూర్తి చేసి వార్డుల రిజర్వేషన్లపై దృష్టిసారించారు. అయితే ఒక్క రాజాం నగర పంచాయతీలో మాత్రం మళ్లీ ఎన్నికల కల నెరవేరలేదు.2005లో నగర పంచాయతీగా ఆవిర్భవించిన రాజాంలో సమీప పంచాయతీల విలీన ప్రక్రియే ఇందుకు ప్రధాన కారణమయ్యింది. రాజాం మండలంలోని రాజాం, సారధి మేజర్‌ పంచాయతీలు, కొత్తవలస పంచాయతీతోపాటు సంతకవిటి మండల పరిధిలోని పొనుగుటివలస, కొండంపేట పంచాయతీల విలీన ప్రక్రియపై కోర్టులో వివాదం నడుస్తోంది. దీంతో ఆవిర్భావం నుంచి అంటే 2005, 2010, 2015లలో మున్సిపల్‌ ఎన్నికలు ఇక్కడ నిర్వహించలేదు. తాజా పరిస్థితులు అలాగే ఉండడంతో 2019లో కూడా ఎన్నికలు జరిగే అవకాశాలు లేవు.

No comments:

Post a Comment