Breaking News

21/05/2019

క్రాప్ హాలీడే దిశగా రొయ్యల రైతులు


ఏలూరు, మే 21, (way2newstv.in)
ఎంపెడా అంతర్జాతీయ మార్కెట్ ధరలను ఎప్పటికప్పుడు ప్రకటించాలని ప్రాన్ ఫార్మర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కోరుతోంది. రొయ్య రైతులకు నష్టం కలిగితే క్రాప్ హాలీడే దిశగా అడుగులు వేయాల్సి వస్తుందన్నారు.  దేశం నుంచి సుమారు 5 లక్షల టన్నుల రొయ్యలు ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి అవుతున్నాయని, అందులో ఆంధ్రప్రదేశ్ నుంచి 4 లక్షల టన్నులు ఎగుమవుతులు అవుతున్నాయని గుర్తుచేశారు. ముఖ్యంగా ఎగుమతిదారులు రొయ్యల రైతులను ధరల సాకుతో నిలువునా దోపీడీ చేస్తున్నారని ఆరోపించారు. కొద్ది రోజుల క్రితం మత్స్యశాఖ మంత్రి ఆది నారాయణరెడ్డి, రొయ్యల సాగు రైతులు, ఎగుమతిదారులు, మార్కెటింగ్, గిడ్డంగులు, పశుగణాభివృద్ధి, పాడి పరిశ్రమ, మత్స్యశాఖ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంపై చర్చించారు. 



క్రాప్ హాలీడే దిశగా రొయ్యల రైతులు

చాలా ఏళ్లుగా కిలో రొయ్యలు 30 కౌంట్‌కు రూ.500 ధరను ప్రకటిస్తే 32 కౌంట్ వచ్చినా అదే ధర చెల్లిస్తున్నారు. ఇది రైతులకు, ఎగుమతిదారుల మధ్య ఉన్నటువంటి ఒప్పందం మేర జరుగుతూ వచ్చింది. ఇప్పుడు కిలోకి 33 కౌంట్ వస్తే ఆ కౌంట్‌ను 40 కౌంట్‌గా పరిగణించి ఆ 40 ధరను మాత్రమే చెల్లిస్తున్నారు. దీంతో రొయ్యల చెరువు చేసుకుంటున్న రైతు లక్షల్లో భారీగా నష్టపోతున్నారు. ఈ అంశంపై ప్రధానంగా చర్చ జరిగింది. ఈ విధంగా వచ్చిన కౌంట్‌లపై కనీసం రూ.100 వ్యత్యాసం ఉంటుంది.ఇటీవల కొద్ది కాలంగా రొయ్యల ధరలు పతనమైన సంగతి తెలిసిందే. అదే విధంగా ఎగుమతిదారులు అంతర్జాతీయంగా డిమాండ్ ఉన్నా రొయ్యలు కొనుగోలు చేయకపోవడం, ఒకవేళ కొనుగోలు చేసినట్లయితే చాలా తక్కువ ధరలకు కొనుగోలు చేయడం వంటి సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఫలితంగా రొయ్య రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. రొయ్యల రైతులు సమావేశమై అనేక కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా ధరల విషయంలో రైతులు సీరియస్‌గా చర్చించారు. ఈ అంశంపై ఎక్కువ సమయం పాటు చర్చ జరిగింది.

No comments:

Post a Comment