Breaking News

24/05/2019

ఈదురు గాలులతో కార్బయిడ్ పండ్లే దిక్కు

వరంగల్, మే 24, (way2newstv.in)

మామిడి పండ్ల మాటున విషం దాగి ఉంది. పక్వానికి రాని పండ్లను హానికరమైన కార్బయిడ్‌తో మాగపెడుతుండడం వలన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉందని వైద్య హెచ్చరిస్తున్నారు.  జిల్లాల్లో  20 వేల హెక్టార్‌లలో మామిడి తోటలు ఉండగా ఈ  ఏడాది  ఈదురు గాలుల వలన మూడు సార్లు  రైతులు పంటలను నష్టపోయారు. అయితే  మామిడి పండ్ల వ్యాపారుల  మాత్రం మహారాష్ట్ర నుంచి  కాయలు తెప్పించి కార్బయిడ్ సహాయంతో  మాగబెట్టి ఇష్టారాజ్యంగా జరుపుతున్నారు.  ప్రతీ రోజు పండ్ల గోదాంలలో వ్యాపారులు కార్బయిడ్‌తో పాటు ఇథిలిన్ రసాయన పదార్థాలు విచ్చలవిడిగా  ఉపయోగిస్తున్నారు. కార్బయిడ్ కిలో  రూ.150కే లభిస్తుండడంతో  కొందరు వ్యాపారులు హోల్‌సేల్‌గా తీసుకువచ్చి ప్రమాదకర రసాయనాలను నిబంధనలకు విరుద్దంగా ఉపయోగిస్తున్నారు. కొందరు వ్యాపారులు సంపాదనే  పరమావధిగా పండ్లను సైతం  విషపూరితంగా మారుస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఈ తతంగాన్ని అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. 


ఈదురు గాలులతో కార్బయిడ్ పండ్లే దిక్కు
నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో మామిడి పండ్ల వ్యాపారులు విచ్చల విడిగా కార్బయిడ్ వినియోగిస్తూ పండ్లను మాగపెడుతున్నారు. పలు చోట్ల ఇటీవల  తాజాగా టాస్క్‌ఫోర్స్ పోలీసులు  జరిపిన దాడుల్లో పెద్ద ఎత్తున కార్బయిడ్‌తో పాటు ఇథిలిన్ అనే రసాయన పదార్ధాలను స్వాధీనం చేసుకొని వ్యాపారులను  అరెస్టు చేశారు. ఈ ఏడాది పంట దిగుబడి తక్కువగా ఉండడంతో మామిడి పండ్లకు మరింత గిరాకీ  పెరిగింది. ఈదురు గాలులకు  రాలిపోయిన కాయలే కాకుండా ఇతర కాయలను కలిపి మాగపెడుతూ విక్రయాలు జరుపుతున్నారు. పక్వానికి ముందే కాలయను కోసం కార్బయిన్ వినియోగంతో ఒక రోజులోనే పండ్లుగా మార్చి  విక్రయాలు జరుపుతున్నారు. కార్బయిడ్ గాలిలో కలిసినప్పుడు ఎసిటాలిన్ వాయివు వెలువడి కాయలను మెత్తబడేలా చూస్తుంది. కేవలం మామిడి పండ్లనే కాకుండా అరటి, పుచ్చ, సపోట, ఈవిధంగా ప్రతి పండును కృత్రిమంగా మాగపెట్టి విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఈ ప్రాంతంలో  వివిధ రకాల పండ్లను మాగపెట్టేందుకు శీతల గదులు లేకపోవడం వలన వ్యాపారులు ప్రధానంగా  మాగపెట్టేందుకు కార్బయిడ్‌ను వినియోగిస్తున్నారు. మాగబెట్టిన పండ్లను తినడం వలన అల్సర్, క్యాన్సర్, కాలేయ జబ్బులతో పాటు మూత్రపిండాలు చెడిపోతాయని వైద్యులు హెచ్చరించినప్పటికి  కార్యరూపం దాల్చడం లేదు.ప్రతి రోజు టన్నుల కొద్ది మామిడి పండ్ల విక్రయాలు జరుగుతున్నాయి.కార్బయిడ్‌తో  మామిడి పండ్లను మాగించడం నేరమని, ఉద్యానశాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అదేవిధంగా ఆహార భద్రత చట్టం ప్రకారం చర్య లు తీసుకునే అవకాశాలు ఉన్నప్పటికీ అధికారులు పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు.  ఇప్పటికైనా సంబంధిత శాఖల అధికారులు అకస్మిక దాడులు నిర్వహించినట్లయితే మామిడి పండ్ల వెనుకదాగి ఉన్న అసలు రహస్యం వెలుగు చూసే అవకాశాలు ఉన్నాయి

No comments:

Post a Comment