Breaking News

28/05/2019

అప్పుల కుప్పగా ఏపీ


విజయవాడ, మే 28 (way2newstv.in
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి అధోగతిలో ఉంది. ఎన్నికలకు ముందు చంద్రబాబు పలు సంక్షేమ, జనాకర్షక పథకాలకు నిధులు ఖర్చు చేశారు. కాంట్రాక్ట్ పనులకు కూడా అప్పులు చేయాల్సి వచ్చింది. ఇన్ని అప్పుల మధ్య ఇప్పుడు జగన్ ముఖ్యమంత్రి అవుతున్నారు. ఈ నేపథ్యంలో జగన్ పాలన ఎలా సాగే అవకాశం ఉంది..? పాలన కోసం నిధులు ఎక్కడి నుంచి తెస్తారు..? ఆంధ్రప్రదేశ్‌ నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న వైఎస్ జగన్‌కు అప్పులు స్వాగతం పలకనున్నాయి. ప్రస్తుతం రాష్ట్రం అప్పుల ఊబిలో మునిగివుంది. రాష్ట్రం విడిపోయాక 16 వేల కోట్ల రూపాయల లోటు బడ్జెట్‌‌‌తో ఉన్న అవశేష ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా చంద్రబాబు పగ్గాలు తీసుకున్నారు. కేంద్ర నుంచి ఏదో సాయం అందుతుందిలే అనుకున్న చంద్రబాబుకు నిరాశే ఎదురైంది. 


అప్పుల కుప్పగా ఏపీ
కేంద్రం నుంచి రావాల్సిన ఎన్నో నిధులకు అతీగతి లేదు. రాష్ట్ర పునర్ విభజన చట్టం ప్రకారం రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు రావాల్సిన 700 కోట్ల రూపాయలపై ఊసే లేదు. పోలవరం, రాజధాని నిర్మాణానికి రావాల్సిన నిధులు విడుదల కాలేదు. రాష్ట్ర విభజన నాటికి ఏపీ 16 వేల కోట్ల రూపాయల లోటు బడ్జెట్‌లో ఉంది. 97 వేల కోట్ల రూపాయల అప్పులు ఉన్నాయి. అవి అమాంతం పెరిగి 2 లక్షల 59 వేల కోట్ల రూపాయలకు చేరుకున్నాయి. ఈ అప్పులపై వడ్డీ 20 వేల కోట్ల రూపాయలకు చేరింది. అసలూ, వడ్డీ కలిపి 2 లక్షల 80 వేల కోట్ల రూపాయల వరకు అవుతుంది. దీనికి తోడు పలు శాఖల్లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు అందలేదు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఓవర్ డ్రాప్ట్ లో కొనసాగుతోంది. ఈ మొత్తం సీఎంగా ప్రమాణం చేస్తున్న జగన్మోహన్ రెడ్డికి తలకు మంచిన భారం అవుతుందని అంటున్నారు. దీంతో ప్రమాణ స్వీకార చేయడానికి ముందే అప్పుల్లో ఉన్న ఏపీకి సాయం చేయమని జగన్ స్వయంగా ప్రధానిని కలిసి విజ్ఞప్తి చేశారు. ఓవర్ డ్రాఫ్ట్‌పై రాష్ట్ర పాలన సాగుతున్నందు వల్ల కేంద్ర ప్రభుత్వ సాయం ఆవశ్యకతను మోడీకి వివరించారు. 

No comments:

Post a Comment