Breaking News

24/05/2019

పక్కదారి పడుతున్న ఆయుధాలు

హైద్రాబాద్, మే 24, (way2newstv.in)
రాష్ట్రంలో అక్రమ ఆయుధాల సరఫరా ఈ విధం గా ఉంటే మరోపక్క లైసెన్స్ కలిగి ఆయుధాలు పక్కదారి పడుతున్నాయి. ఇంతకూ రాష్ట్రంలో లైసెన్స్ ఆయుధాలు ఎన్ని ఉన్నాయి..? ఎంత మంది వాటిని రెన్యూవల్ చేసుకుంటున్నారు..? రెన్యూవల్ కాకుండా అక్రమంగా ఎంత మంది దాచుకున్నారు..? లైసెన్స్‌లో తెలిపిన చిరునామాలోనే వారు ఉంటున్నారా..? వారికి లైసెన్స్ నిజంగా అవసరమేనా..? అనే అంశాలపై పోలీసులకు సరైన అవగాహన లేదు. ఎన్నికలు, పండుగల సమయంలో మాత్రం ఆయా పోలీసు స్టేషన్‌లలో లైసెన్స్ ఆయుధాలను అప్పగించాల్సి ఉంటుంది. ఆ సమయంలో లైసెన్స్ రిన్యూవల్ చేసుకోని ఆయుధాలు పోలీసు స్టేషన్‌కు రాకుం డా పోతున్నాయి. అయినా పోలీసులు వాటిపై దృష్టి సారించడం లేదు. మరో వైపు హైదరాబాద్ పాత బస్తీలో ఓ బారాత్ వేడుకల్లో యువకుడి కాల్పులు, బంజారాహిల్స్‌లో మాజీ మంత్రి ముఖేశ్‌గౌడ్ తనయుడు విక్రమ్‌గౌడ్‌పై కాల్పులు, మహబూబ్‌నగర్ లో ఆర్‌టిసి బస్సులో గన్ లభ్యం… మాదన్నపేట రౌడీషీటర్ అహ్మద్ వద్ద పిస్తోల్ స్వాధీనం, జడ్చర్లలో టీచర్ ఇంట్లో దోపిడీకి వచ్చిన దుండగుల చేతిలో రివాల్వర్& ఇలాంటి పలు కేసులలో నిం దితుల వద్ద అక్రమ ఆయుధాలు బయట పడుతున్నాయి. పక్కదారి పడుతున్న ఆయుధాలు

ఈ ఆయుధాలన్నీ బీహార్, ఉత్తరప్రదేశ్‌ల నుంచే దిగుమతి చేసుకున్నట్లు పోలీసుల విచారణలో వెలుగుచూసింది. ఇలా దిగుమతి చేసుకున్న వాటిలో రాష్ట్రంలో ప్రతి ఏటా 30 నుంచి 70 వర కు వివిధ కేసులు నమోదవుతున్నాయి. ఇంకా బ యటపడకుండా ఎంతమంది అక్రమంగా ఇలాం టి ఆయుధాలు దా చుకున్నారో స్పష్టమై న సమాచారం లేదు. ఏదైనా సం ఘటన జరిగినప్పుడు మాత్రమే గన్ కల్చర్ బయట పడుతోంది. అంతవరకు వాటిపై పోలీసులు ఎలాంటి దృష్టి పెట్టడంలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆర్‌టిసి బస్సుల్లో, రైలు మార్గం ద్వారా, ప్రైవేటు ట్రాన్స్‌పోర్టు మార్గం గుండా రాష్ట్రంలోకి తుపాకులు దిగుమతి అవుతున్నట్లు పోలీసులకు పట్టుబడిన నిందితులను విచారిస్తున్న సందర్భంగా వివరాలు బయటకొస్తున్నాయి.బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లోని అనేక ప్రాంతాల్లో తుపాకుల తయారీ కుటీర పరిశ్రమగానే ఉంటుంది. నగరానికి సరఫరా అవుతున్న నాటు తుపాకుల్లో దాదా పు 90 శాతం ఇక్కడి నుంచి దిగుమతి చేసుకుంటున్నవే. ఒకప్పుడు కేవలం తపంచాలకు మాత్రమే పరిమితమైన ఈ పరిశ్రమలు ఇప్పుడు అత్యాధునిక తుపాకులను సైతం తయారు చేస్తున్నాయి. బిహార్‌లోని గయ, యూపిలోని నాన్‌గల్, హసన్‌పూర్ తదితర ప్రాంతంలో తయారవుతున్న నాటు తుపాకులకు సేఫ్టీలాక్ వంటి ఆధునిక సౌకర్యాలు సైతం ఉండటం గమనార్హం. కేవలం కంపెనీ మేడ్ పిస్టల్స్‌కు మాత్రమే ఉండే ఈ సౌలభ్యాన్ని ఇక్కడ తయారయ్యే రివాల్వర్లకు సైతం ఏర్పాటవుతున్నాయి. బిహార్, యూపిలనుంచి నగరానికి సరఫరా అవుతున్న వాటిలో ఆటోమేటిక్, సెమీ-ఆటోమేటిక్ రకాలతో పాటు అతి చిన్న సైజులో ఉండే సింగిల్ షాట్ గన్స్ కూడా ఉంటున్నాయి. కేవలం డిఫెన్స్, పోలీసు శాఖలు మాత్రమే వినియోగించే ‘ప్రొహిబిటెడ్ బోర్’గా పిలిచే పాయింట్ 9 ఎంఎంలను అక్కడి వ్యక్తులు నాటు పద్దతిలో తయారు చేస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారునగరానికి ఉత్తరాది నుంచి తుపాకులు సరఫరా చేస్తున్న ముఠాలు ఏ మాత్రం కష్టపడట్లేదు. గత ఏడాది అరెస్టైన ఆరిఫ్, జహీద్ కేవలం సూట్‌కేసుల్లో పెట్టుకుని, రైళ్లల్లో నగరానికి తీసుకువచ్చినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. మరోపక్క ఈ అక్రమ రవాణా కోసం ప్రత్యేక ముఠాలు కూడా పనిచేస్తున్నాయి. వీరికి రైలుమార్గం ఓ వరంగా మారింది. జనరల్ బోగీల్లో తనిఖీలు అంతంతమాత్రంగా ఉండటంతో వీటిలోనే ఆయుధాలు రవాణా చేస్తున్నారు. వీటికి తోడు ట్రాన్స్‌పోర్ట్ లారీల్లోనూ నగరానికి వస్తున్నాయి. ఓ పక్క ముఠాలే కాకుండా అక్కడ నుంచి వచ్చే దినసరి కూలీలు సైతం ఆయుధ వ్యాపారాన్ని ఆదనపు ఆదాయ మార్గంగా భావిస్తున్నారు. పనుల కోసం నగరంలో స్థిరపడిన బిహారీలు రాకపోకలు సాగించే సమయంలో తమతో పాటు కొన్ని ఆయుధాలు తీసుకువచ్చి విక్రయిస్తున్నారు. హైదరాబాద్‌తో పాటు శివార్లలో వీటిని విరివిగా విక్రయిస్తున్నారు. వాస్తవానికి  లైసెన్స్ పొంది ఆయుధాన్ని కొనుగోలుచేసిన వ్యక్తి దాని పూర్తి రక్షణకు బాధ్యత వహించాల్సి ఉంటుంది. లైసెన్స్ హోల్డర్‌కు చెందిన తుపాకీ మరో వ్యక్తి నిర్వహించడం, చెత్తో పట్టుకుని సంచరించడం ఆయుధ చట్టం ప్రకారం నేరం. దీనికి ఆ ఆయుధాన్ని పట్టుకున్న వ్యక్తితో పాటు లైసెన్స్ కలిగిన వ్యక్తి బాధ్యడు అవుతాడులైసెన్స్ హోల్డర్ కేవలం తనకు ప్రాణహాని ఉన్న సందర్భాల్లో మాత్రమే తుపాకీని వినియోగించి కాల్పులు జరపాల్సి ఉంటుంది. సరదా కోసమో, ఆర్భాటంలో భాగంగానేనో, అనవాయితీ పేరుతోనే కాల్పులకు దిగడం చట్టప్రకారం నేరం. లైసెన్స్ హోల్డర్ ఖరీదు చేసే, ఖర్చు పెట్టే ప్రతి తూటాకీ కచ్చితంగా లెక్క చెప్పా లి. ఏమాత్రం అనుమానాస్పదంగా ఉన్నట్లు గుర్తించినా రెన్యువల్ చేయకున్నా ఆ లైసెన్స్‌ను రద్దు చేసే అవకాశం ఉంది. 

No comments:

Post a Comment