తెలంగాణలో ఐజీ స్టీఫెన్ రవీంద్ర ఏపీ ఇంటిలిజెన్స్ బాస్ గా నియమితులయ్యారు. వైకాపా అధినేత, ఏపీకి కాబోయే ముఖ్యమంత్రి జగన్ విజ్ఞప్తి మేరకు ఆయన్ను కేంద్ర హోంశాఖ ఏపీకి డిప్యుటేషన్ పై కేటాయించింది. స్టఫెన్ రవీంద్ర 1999 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. ప్రస్తుతం ఐజీ స్థాయిలో హైదరాబాద్ రేంజ్ లో వున్నారు.
ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా స్టీఫెన్ రవీంద్ర
వరంగల్ జిల్లాలో ప్రారంభమయిన అయన సర్వీసు నక్సలైట్లపై ఉక్కుపాదం మోపడానికి ఉపయోగపడింది. పలుసార్లు జాతీయ స్థాయిలో అయనకు అవార్డులు దక్కాయి. దివంగత రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా వున్నప్పుడు స్టీఫెన్ అయన కు ముఖ్య భద్రతాధికారిగా పనిచేసారు. గతంలో రాయలసీమలో ఫ్యాక్షన్ ప్రభావిత ప్రాంతాలతో పాటు ఉగ్రవాద, మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్లలో స్టీఫెన్ రవీంద్ర పనిచేశారు.
No comments:
Post a Comment