Breaking News

14/05/2019

రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు

కర్నూలు, మే, 14 (way2newstv.in):
జిల్లాలోని జాతీయ రహదారి ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా జాతీయ రహదారిలోని ప్రధాన కూడళ్లలో ప్రమాదాలు నివారణకు వెంటనే చర్యలు తీసుకోవాలని  జిల్లా కలెక్టర్ సత్యనారాయణ అధికారులను ఆదేశించారు. జిల్లా ఎస్.పి పక్కీరప్పతో కలసి మంగళవారం కలెక్టరేటులోని సమావేశ మందిరంలో జాతీయ రహదారిలోని ప్రధాన కూడళ్లలో ప్రమాదాల నివారణకు తాత్కాలికంగా తీసుకోవాల్సిన  చర్యలు, శాశ్వతంగా తీసుకోవాల్సిన చర్యల పై అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా  కలెక్టర్  మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణకు బ్లాక్ ప్పాట్స్ ను గుర్తించి, తగిన చర్యలు తీసుకుంటున్నాం. అయినప్పటికీ ప్రమాదాలు జరగడం ఆగడం తేదు. రహదారి నిర్మాణ సాంకేతిక కారణాలు. డ్రైవర్లు నియమ నిబంధనలు పాటించకపోవడం తదితర కారణాల వల్ల తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇక పై ఎలాంటి ప్రమాదాలు జరగడానికి వీల్లేదన్నారు. 


 రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు

ఇందుకు సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. వెల్దుర్తి దగ్గర గత శనివారం జరిగిన రోడ్డు ప్రమాదం దురదృష్టకరమన్నారు. జాతీయ రహదారీలో సరైన భద్రత చర్యలు లేకపోవడంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయన్నారు. జిల్లాలోన జాతీయ రహదారిలో గ్రామాలు కలిసే మార్గాలు వెల్దుర్తి, ప్యాపిలి, డోస్, చెరుకులపాడు, కంబాలపాడు, చిన్న  టేకూరు, ఉలిందకొండ, నన్నూరు, ఓర్వకల్, హుశేనాపురం తదితర ప్రాంతాల్లో నగరం లోని చెన్నమ్మ కొండలో ప్రమాదాలు నివారణకు తాత్కలికంగా చర్యలు వేంటనే తీసుకోవాలన్నారు. సమీప గ్రామాల నుంచి జాతీయ రహదారి పైకి వచ్చే వాహనాల వేగాన్ని నియంత్రించేందుకు స్పీడ్ బ్రేకర్లను నిర్మించాలని ఆర్.అండ్ బి. ఎస్.ఇ  జయారామి రెడ్డిని ఆదేశించారు. నంద్యాల ఆదోని రహదారులపై ప్రమాదాల నివారణకు తీసుకోవలసిన చర్యలు, బ్లాక్ స్పాట్స్ తదితర సంబంధిత  అడిగి తెలుసుకుని పలు సుచనలు చేసారు.  జిల్లా ఎస్ పక్కీరప్ప మాట్లాడుతూ జిల్లాలో మరో ప్రమాదం జరుగకముందే చర్యలు తీసుకోవాలన్నారు. అధిక  లోడ్ లో వెళ్లే వాహనాలను అరికట్టాలన్నారు. అలా వెళ్తే జరిమానాలు విధించాలన్నారు. ట్రిపుల్ రైడింగ్ చేసే వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. రాంగ్ రూట్ లో వేళ్లే వారిపై అవగాహన కల్పించాలన్నారు. వినకపోతే రుసుంను విధించాలన్నారు. సీటె బెల్ట్ దరించాలన్నారు.  అంతకుముదు గత శనివాం వెల్లురి సమీపంలో బస్సు దర్ఘటనలో మరణించిన వారికి మనశాంతి కలగాలని రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమీషనర్ ప్రశాంతి, డిసిపి బసిరెడ్డి, ఆర్.టి ఓ జగధీశ్వరాజు ఆర్ ఎస్ జయరామి రెడ్డి, డియంఅండ్ హెచ్ ఓ డా. ప్రసాద్, డిఎస్పీ జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. 

No comments:

Post a Comment