Breaking News

14/05/2019

సమర్ధవంతంగా ఎన్నికల ఓట్ల కౌంటింగ్

నాగర్ కర్నూల్ పార్లమెంట్ రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ శ్రీధర్
నాగర్ కర్నూలు, మే, 14 (way2newstv.in):
పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ ఈ నెల 23 తేదీన నిర్వహించనున్న ఓట్ల లెక్కింపును పక్కాగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఇ శ్రీధర్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో కౌంటింగ్  ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల ఏఆర్ఓలు,జిల్లా అధికారులు, మరియు కౌంటింగ్ నిర్వహించే ఆపరేటర్లతో సమావేశం నిర్వహించారు సమావేశంలో కలెక్టర్ కలెక్టర్ మాట్లాడుతూ కౌంటింగ్ నిర్వహించే సిబ్బంది అప్రమత్తతో పనిచేసి కౌంటింగ్ సమర్థవంతంగా నిర్వహించేందుకు ఏఆర్వోలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఓట్ల కౌంటింగ్ కోసం 14 టేబుల్స్ను పరిగణలోకి తీసుకొని ఒక్కో రౌండ్ చొప్పున కౌంటింగ్ నిర్వహించడం మొత్తం 20 రౌండ్లు కౌంటింగ్ జరుగుతుందని తెలిపారు. సూపర్వైజర్ మిషన్ బటన్ నొక్కితే అసిస్టెంట్ సూపర్వైజర్ నమోదైన 
ఓట్లను రాసుకోవాలని, వీరిద్దరు పని చేస్తున్నారా? లేదా ? అని పరిశీలించేందుకు ఒక మైక్రో అబ్జర్వర్ ఉంటారని తెలిపారు. ఓట్ల లెక్కింపు కార్యక్రమం సహాయ రిటర్నింగ్ అధికారులు,జిల్లా ఎన్నికల అబ్జర్వర్, ఏజెంట్ల సమక్షంలో జరుగుతుందన్నారు. 23వ తేదీన ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుందని, ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల కౌంటింగ్ ప్రారంభించడం జరుగతుందని,  అనుమతిస్తామన్నారు. మూడంచెలుగా భద్రతా బలగాలను నియమించడం జరిగిందన్నారు.


సమర్ధవంతంగా ఎన్నికల ఓట్ల కౌంటింగ్ 

మొబైల్ ఫోన్లు లోపలికి తీసుకెళ్లరాదన్నారు. కౌంటింగ్ కోసం ఏ టేబుల్కు ఏ కంట్రోల్ యూనిట్ వస్తుందనేది రాసి ఉంటుందని, కంట్రోల్ యూనిట్పై మూడు సీల్స్ ఉన్నాయా ? లేదా? చెక్ చేసి ఏజెంట్లకు చూపించి ఓపెన్ చేయాలన్నారు. కంట్రోల్ యూనిట్ నెంబర్, సిబ్బందికి ఇచ్చిన నెంబర్ సరిగా ఉందా ? లేదా అని చెక్ చేసుకోవాలని తెలిపారు. కౌంటింగ్ కు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, కౌంటింగ్ హాల్లోని ప్రతి టేబుల్ను వీడియో తీస్తారని, సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని, ఫారం-17సీ ఫార్-2ను చెక్ చేయాలన్నారు. అనంతరం ఓట్ల లెక్కింపు ప్రక్రియను వీఆర్వోలకు వివరించారు.ఈ నెల 16వ తేదీన కౌంటింగ్ శిక్షణా తరగతులకు కౌంటింగ్ నిర్వహించే అందరి సిబ్బంది హాజరు కావాలని సహాయ రిటర్నింగ్ అధికారులు జిల్లా అధికారులు హాజరై అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సీటింగ్ ప్రక్రియను నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.పార్లమెంట్ ఎన్నికల ఫలితాలను వెల్లడించే కౌంటింగ్ రోజుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా చేసుకోవాలని, కౌంటింగ్ హాల్లో అవసరమైన మేర అత్యాధునిక సాంకేతికతో కూడిన కంప్యూటర్లను వినియోగించాలని, అత్యంత వేగంగా ఉండే  నెట్ కనెక్టివిటీని ప్రత్యేకమైన ఐపీ అడ్రస్సుతో ఏర్పాటు చేయాలని, ప్రత్యామ్నాయంగా ఇతర ప్రైవేట్ నెట్వర్క్స్ సైతం అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. కంప్యూటర్లుకు 8 గంటలకు పైగా బ్యాక్అప్ వచ్చే బ్యాటరీలను సైతం ఏర్పాటు చేసుకోవాలని, కౌంటింగ్ సమయంలో ఎలాంటి పొరపాట్లూ జరగవద్దని, లైసెన్స్తో కూడిన మైక్రోసాఫ్ట్ ఆఫీస్లను మాత్రమే వినియోగించాలని, కంప్యూటర్ రూమ్కు పటిష్ట భద్రత సైతం ఏర్పాటు చేయాలని సూచించారు. కౌంటింగ్ రౌండ్ల వారీగా ముగిసిన అనంతరం జిల్లా ఎన్నికల పరిశీలకులు ఆమోదంతో  ఏఆర్వో స్వయంగా సువిధా వెబ్సైట్  లో అప్లోడ్ చేయాలన్నారు. వివరాలను నమోదు చేసిన అంనతరం మాత్రమే బయట మిడియా వారికి విడుదల చేయాలని ఆదేశించారు.  పోస్టల్ ఓట్ల వివరాలను రిటర్నింగ్ అధికారి మాత్రమే సువిధా వెబ్సైట్లో నమోదు చేస్తారని, రిటర్నింగ్ అధికారికి మాత్రమే సువిధా పోర్టల్ ఎడిట్ చేసే అవకాశం ఉంటుందని, తుది ఫలితాలు ప్రకటించిన తరువాత ఎటువంటి మార్పులు చేసేందుకూ వీలులేదని ఆయన స్పష్టంచేశారు. కౌంటింగ్ ముగిసిన అనంతరం టెండర్ ఓట్లను లెక్కించిన తరువాత ఆ వివరాలను నమోదు చేయాలని, ఫారం 21ఈని డౌన్లోడ్ చేసుకొని, రికార్డులతో మరోమారు సరిచూసుకొని ఫలితాలను ప్రకటించాలని ఆయన తెలిపారు.ఈ నెల 20న సుఖ జీవన్ రెడ్డి గార్డెన్ నందు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మాక్ కౌంటింగ్ నిర్వహించాలని, సహాయ రిటర్నింగ్ అధికారులు, అందరు కౌంటింగ్ సిబ్బంది తప్పకుండా హాజరుకావాలని కలెక్టర్ గారు ఆదేశించారు. పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ సమర్థవంతంగా నిర్వహించి ఫలితాలను నిష్పక్షపాతంగా విడుదల చేసేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సహాయ రిటర్నింగ్ అధికారులను ఆదేశించారు ఈ సమావేశంలో లో నాగర్ కర్నూలు జాయింట్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి  గద్వాల జాయింట్ కలెక్టర్ నిరంజన్ జిల్లా అధికారులు మధుసూదన్ నాయక్,  బైరెడ్డి సింగారెడ్డి, అంజప్ప, మోహన్ రెడ్డి, అఖిలేష్ రెడ్డి, ఆర్డీవో ఓలు హనుమాన్ నాయక్,  వెంకటయ్య, రాజేష్ కుమార్ కౌంటింగ్ నిర్వహించే కంప్యూటర్ ఆపరేటర్లు తదితరులు పాల్గొన్నారు. 

No comments:

Post a Comment