Breaking News

16/05/2019

శివార్లలలో మురుగు సమస్య

శ్రీకాకుళం, మే 16, (way2newstv.in)
శ్రీకాకుళం నగరానికి ఆనుకుని ఉన్న శివారు కాలనీల్లో సమస్యలతో జనం సతమతమవుతున్నారు. ప్రధానంగా డిసిసిబి కాలనీ, ఇందిరానగర్‌ వాసులకు మురుగు సమస్య పట్టి పీడిస్తోంది. ఖరీదైన భవంతులు ఉన్నా వాటి మధ్య కాలువల నిర్మాణం లేక ఎక్కడ మురుగు అక్కడే నిలిచిపోతోంది. నిర్మాణాలు లేని ఖాళీ స్థలాల్లో సైతం మురుగుతో నిండిపోతున్నాయి. నగరం నుంచి వచ్చే మురుగు ఈ కాలనీలను ముంచెత్తుతోంది. పెద్ద ఎత్తున వస్తున్న మురుగు దిగువకు వెళ్లక ఎక్కడికక్కడే నిలిచి వాటిపైన గుర్రపుడెక్క, మొక్కలు చేరిపోయాయి. దీంతో స్థానికులు ముక్కు మూసుకొని జీవనం సాగించాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ కాలనీల మధ్యలో ఉండే వ్యవసాయ పంట కాలువలు సైతం ఆక్రమణలకు గురయ్యాయి. 


 శివార్లలలో  మురుగు సమస్య

మిర్తిబట్టీల్లో వర్షాకాలం వచ్చే వరదతో పాటు గుర్రపుడెక్క మొక్కలు ఈ కాలనీల్లో ఇప్పుడు పైకి పచ్చని తివాచీలా కనిపిస్తున్నాయి. వాటి కింద మురుగు నిలిచి పోవడంతో విషపు పాములు ఇళ్లలోకి వచ్చి చేరుతున్నాయి. చాపురం పంచాయతీ పరిధిలో ఉన్న ఈ కాలనీల్లో మురుగు ఇప్పుడు ప్రధాన సమస్యగా మారిందినగరానికి ఆనుకుని ఇందిరానగర్‌, ప్రకాష్‌నగర్‌, డిసిసిబి కాలనీలు విస్తరించి ఉన్నాయి. వేల కుంటుంబాలు ఈ కాలనీల్లో ఇప్పుడు స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకొని జీవనం సాగిస్తున్నారు. కాలనీల విస్తరణ జరిగినా ఇళ్లల్లో వినియోగించే వ్యర్థ జలాలు బయటకు వెళ్లేందుకు కాలువల నిర్మాణం జరగలేదు. నారాయణపురం ఆనకట్ట పరిధిలోని మిర్తిబట్టిలో కూడా ఇప్పుడు ఒక వైపు ఆక్రమణలు, మరో వైపు గుర్రపుడెక్క మొక్కలతో నిండింది. దీంతో కాలనీల్లోకి వచ్చి చేరుతున్న మురుగు ఇప్పుడు తాగునీటి బావుల్లోకి వచ్చి చేరుతోంది. దీంతో స్థానికులు అవస్థలు పడుతున్నారు. మిర్తిబట్టిని ఆధునీకరిస్తూ ప్రభుత్వం గతేడాది నిధులు వెచ్చించింది. ఈ నిధులతో ప్రజారోగ్య శాఖ చేపట్టిన కాలువ నిర్మాణం పనులు అర్థాంతరంగా నిలిచాయి. కాలనీల్లో ఆక్రమణలు తొలగించి శాశ్వత నిర్మాణం జరిగితే తప్ప స్థానికులకు మురుగు సమస్య తప్పదని ఆయా కాలనీవాసులంతా వాపోతున్నారు

No comments:

Post a Comment