Breaking News

27/05/2019

టిడిపి ఓటమికి నేతలమంతా బాధ్యత వహిస్తున్నాం: డొక్కా


అమరావతి మే 27 (way2newstv.in)
ఇటీవల జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓటమికి తెదేపా నేతలమంతా బాధ్యత వహిస్తున్నామని ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ అన్నారు. సోమవారం గుంటూరులో మీడియాతో ఆయన మాట్లాడారు. ఎన్నికల్లో గెలుపోటములు సహజమనీ, తెదేపా శ్రేణులు నిరాశ చెందవద్దని సూచించారు. పార్టీ అధినేత చంద్రబాబు ఆలోచనలను తాము ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోయామన్నారు. 


టిడిపి ఓటమికి నేతలమంతా బాధ్యత వహిస్తున్నాం: డొక్కా
ప్రస్తుతం రాష్ట్రంలో చాలాచోట్ల తెదేపా నేతలపై దాడులు జరుగుతున్నాయని.. రాజకీయాల్లో కక్షసాధింపు చర్యలు సరికాదని డొక్కా అన్నారు. ఈ తరహా దాడులు జరగకుండా ప్రభుత్వ యంత్రాంగం, పోలీసులు తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఏపీలో చిన్న జిల్లాలను ఏర్పాటు చేస్తే అభివృద్ధి ఉరకలేస్తుందని డొక్కా వ్యాఖ్యానించారు. గురజాల కేంద్రంగా పల్నాడును జిల్లా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజాతీర్పును తాము గౌరవిస్తున్నామని చెప్పారు. కొత్త ప్రభుత్వానికి నిర్మాణాత్మక సూచనలు ఇస్తామని.. అవినీతికి వ్యతిరేకంగా జగన్ పనిచేస్తే వ్యక్తిగతంగా సహకరిస్తామని డొక్కా మాణిక్యవరప్రసాద్‌ స్పష్టం చేశారు.

No comments:

Post a Comment