Breaking News

02/05/2019

తగ్గిన టమాటా దిగుమతి

చిత్తూరు, మే 2, (way2newstv.in)
కొంత కాలంగా నేల చూపులు చూసిన టమాటా ధర ఒక్కసారిగా పెరిగింది. నగరానికి సరఫరా భారీగా తగ్గింది. రెండు వారాల క్రితం లారీల కొద్దీ టమాటా మార్కెట్‌ను ముంచెత్తింది. దీంతో కిలో 8 రూపాయల వరకు తగ్గింది. కానీ వేసవి ఎండలు మండిపోతుండడం, నీటి సమస్యల కారణంగా రైతులు టమాటా పండించడానికే జంకే పరిస్థితి ఏర్పడింది. దీంతో ఒక్కసారిగా దిగుబడి తగ్గిపోవడంతో టమాటా కొరత తీవ్రంగా మారింది. సాధారణ రోజుల్లో నగరానికి 80 నుంచి 100 లారీల టమాటా దిగుమతి అవుతుండగా ప్రస్తుతం రోజుకు 50లారీలు కూడా రావడం లేదని వ్యాపారులు తెలిపారు.


తగ్గిన టమాటా దిగుమతి

దీంతో ధరల్లో తీవ్ర మార్పులు చోటు చేసుకున్నాయి. హోల్‌సెల్ మార్కెట్లోనే కిలోకు 40 నుంచి 45 రూపాయల వరకు పలుకుతోంది. రిటైల్ మార్కెట్లో మాత్రం కిలోకు 50 నుంచి 60 రూపాయలు వసూలు చేస్తున్నారు. ఏపీలోని చిత్తూరు జిల్లా మదనపల్లి, గుంటూరు, తదితర ప్రాంతాల నుంచి కూడా టమాటా దిగుమతి అవుతుంది. నగరానికి రోజుకు  టన్నుల టమాటా డిమాండ్ ఉండగా ప్రస్తుతం 20 టన్నులు కూడా రావడం లేదని వ్యాపారులు చెబుతున్నారు. కర్నాటక, రాజస్థాన్ నుంచి టమాటా వచ్చేది. ప్రస్తుతం ఆయా రాష్ట్రాల్లోనూ టమాటా దిగుబడి తక్కువగా ఉండడం వల్ల నగరానికి సరఫరా తగ్గింది. మార్కెట్‌లో టమాటా కొరతను దృష్టిలో పెట్టుకుని సూపర్ మార్కెట్‌లు, మాల్స్ నిర్వాహకులు మాత్రం పెద్దమొత్తంలో టమాటాను రైతుల నుంచి టోకుగా కొనుగోలు చేసేస్తున్నాయి. దీంతో మార్కెట్‌కు టమాటా సరఫరా తగ్గిందని వ్యాపారులు అంటున్నారు. ప్రతి వేసవిలోనూ ఇలాంటి పరిస్థితి ఉంటుందని, జూన్ నెలాఖరు వరకూ టమాటా ధరల్లో హెచ్చు తగ్గులు తప్పవని మార్కెట్ కమిటీ అధికారి ఒకరు స్పష్టం చేశారు. 

No comments:

Post a Comment