Breaking News

03/05/2019

రీ పోలింగ్ ఓటు రేటు 7 వేలు .. 10 వేలు

ఒంగోలు, మే 3,(way2newstv.in)
ఏపీలో రీ పోలింగ్‌పై ఇలా ఎన్నికల సంఘం ప్రకటన చేసిందో లేదో... అప్పుడే.. పార్టీలు ప్రలోభాలకు సిద్దహవుతున్నాయి. ఎలా అయిన ఎన్నికల్లో గెలిచే తీరేందుకు ఓటుకు రేటు కడుతున్నారు. ఓట్ల వందల్లో ఉన్నా కూడా వేలు పోసి ఎలా అయినా ఓటర్లను కొనుగోళ్లు చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు. సర్వశక్తులూ ఒడ్డేందుకు టీడీపీ, వైసీపీ సిద్ధమవుతున్నాయి. హోరా హోరీగా పోరుసాగిన నియోజకవర్గాలలో అభ్యర్థులు ఏ అవకాశాన్ని వదిలి పెట్టడం లేదు. మే 6న జరిగే రీపోలింగ్ లో రూ. 7,000 నుంచి రూ. 10,000 వెచ్చించడానికి వెనుకాడటం లేదు. 


రీ పోలింగ్ ఓటు రేటు 7 వేలు .. 10 వేలు

నరసరావుపేట పరిధిలోని కేసనపల్లి - 94వ నెంబర్ పోలింగ్‌ బూత్, గుంటూరు వెస్ట్ పరిధిలోని నల్లచెరువు - 244వ పోలింగ్‌ బూత్, కోవూరు పరిధిలోని పల్లెపాలెం, ఇసుకపల్లి - 41వ పోలింగ్‌ బూత్, సూళ్లూరుపేట పరిధిలోని అటకానితిప్ప-197వ పోలింగ్‌ బూత్, ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం పరిధిలోని కలనూతల - 247వ పోలింగ్‌ బూత్‌ లో రీపోలింగ్ జరగనుంది.ప్రధానంగా ఇక్కడ టీడీపీ, వైసీపీ అభ్యర్థులు మధ్య తీవ్రపోటీ నెలకొని ఉంది. దీంతో ఈ నియోజకవర్గాల్లో రూ. 10,000 ఇవ్వడానికి కూడా అభ్యర్థులు రెడీ అవుతున్నారు. ఈ ఓట్ల కొనుగోలు ప్రధానంగా నర్సరావుపేట, గుంటూరు వెస్ట్ , కోవూరు, సూళ్లూరుపేటలో నియోజకవర్గాలలో రీ-పోలింగ్ జరిగే కేంద్రాలలో జరుగుతోంది. ఈ నియోజకవర్గాలలో టీడీపీ, వైసీపీతో పాటు.. జనసేన, కాంగ్రెస్, బీజేపీ తదితర పార్టీల అభ్యర్థులు కూడా పోటీలో ఉండటంతో వైసీపీ, టీడీపీ విజయం కోసం ఓటుకు rs.10,000 ఇవ్వడానికి కూడా వెనుకాడటం లేదు. దీంతో రీ పోలింగ్‌పై కూడా గట్టి నిఘా ఏర్పాటు చేశారు ఎన్నికల సంఘం అధికారులు.

No comments:

Post a Comment