Breaking News

04/05/2019

21 రోజుల్లో భవనాలకు అనుమతి

హైద్రాబాద్, మే 4, (way2newstv.in)
హెచ్‌ఎండీఏ పరిధిలో నిర్మాణ రంగం జోరుమీదున్నది.  నాలుగు నెలలుగా సంస్థ పరిధిలో అనుమతుల తాకిడి విపరీతంగా పెరిగింది.గడిచిన కొన్ని నెలలుగా రియల్ భూం ఊపుమీదుండడం, మరోవైపు హైదరాబాద్ నగరాన్ని విశ్వ నగరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలను విరివిరిగా చేపడుతున్నది.భారీ లే అవుట్లు, విల్లాలు, గ్రూప్ హౌసింగ్‌లు, భవన నిర్మాణాలు చేపడుతున్నారు. హైదరాబాద్ చుట్టూ పెట్టుబడులు పెట్టేందుకు కంపెనీలు ఆసక్తి చూపుతుండడంతో  ప్లాట్లు, ఫ్లాట్స్, విల్లాలు కొనుగోలు చేసే వారీ సంఖ్య గణనీయంగా పెరిగింది.ప్రభుత్వ సంక్షేమ పథకాలు, పెట్టుబడులను ప్రోత్సహిస్తూ తీసుకుంటున్న తీరు, ముఖ్యంగా హైదరాబాద్‌లో పెట్టుబడులకు నిలయంగా మారడంతో రియల్ కళను సంతరించుకున్నది. దరఖాస్తుల తాకిడికి అనుగుణంగా పనిచేస్తూ పారదర్శక అనుమతులు మంజూరు చేస్తున్నాం. 


21 రోజుల్లో భవనాలకు అనుమతి

ఒక్క అనుమతుల రూపంలోనే సంస్థకు నెలకు రూ. 50కోట్ల మేర ఆదాయాన్ని సమకూర్చుకుంటున్నాం దీంతో రియల్ వ్యాపారస్తులు హెచ్‌ఎండీఏ పరిధిపై ప్రధాన దృష్టి సారించారు. దీంతో గడిచి. ఈ తరుణంలోనే హెచ్‌ఎండీఏ పౌరులకు సత్వర సేవలే లక్ష్యంగా డెవలప్‌మెంట్ పర్మిషన్ మేనేజ్‌మెంట్ సిస్టం ద్వారా అవినీతి రహిత సేవలతో పాటు అతి తక్కువ సమయంలోనే ఆయా నిర్మాణాలకు అనుమతులు మంజూరు చేస్తున్నారు. అన్ని పత్రాలు ఉన్న దరఖాస్తును నిర్ణీత 21 రోజుల లోపే పరిష్కారం చూపాలన్న ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా పనిచేస్తూ పారదర్శకత అనుమతులు అందిస్తూ సగటు పౌరుల నుంచి హెచ్‌ఎండీఏ భేష్ అనిపించుకుంటున్నది. రెండేళ్ల కిందట హెచ్‌ఎండీఏ పనితీరు పట్ల సగటు పౌరుడు అభిప్రాయం. కానీ ప్రస్తుతం ఇందుకు పూర్తిగా విరుద్ధం..మద్యవ్యక్తి ప్రమేయం లేకుండానే కూర్చున్న చోట దరఖాస్తు మొదలు అనుమతుల మంజూరు వరకు అంతా ఆన్‌లైన్‌లోనే. లే అవుట్, బిల్డింగ్ అనుమతులు, ఎల్‌ఆర్‌ఎస్, ప్రాసెసింగ్ ఛార్జీలు, భూవినియోగం ధ్రువీకరణ, మార్పిడి, నిరభ్యంతర ధ్రువీకరణ, పార్కులు, కమర్షియల్ భవనాల అద్దె తదితర సంస్థకు సంబంధించిన ఏ పని అయినా అవినీతిరహిత సేవలు ఇప్పుడు పౌరుల సొంతం. డీపీఎంఎస్ ద్వారా పది రోజుల లోపే ఆయా నిర్మాణాలకు అనుమతులు మంజూరు చేస్తున్నారు. కమిషనర్ చిరంజీవులు రోజు వారీ ఆన్‌లైన్ పర్యవేక్షణ చేస్తూ నిర్ణీత గడువులోగా పూర్తి చేయని అధికారులను మందలిస్తూ , గడువు ముగిస్తే రోజుకు రూ. వెయ్యి జరిమానా అంటూ అనుమతుల జారీని వేగవంతం చేశారు. 

No comments:

Post a Comment