Breaking News

05/04/2019

రోడ్లు లేక అల్లాడుతున్న గిరిజన గ్రామాలు

అదిలాబాద్, ఏప్రిల్ 5, (way2newstv.in)
ఆదిలాబాద్ జిల్లా బజార్‌హత్నూర్ మండలంలోని భూతాయి(కే) గ్రామ పంచాయతీ అనుసంద గ్రామలైన మాన్కపూర్, గొసయి, ఉమర్డ ఇంద్రనగర్, డెడ్రా గిరిజన గ్రామాలకు రోడ్డు సౌకర్యాం లేకపోవడంతో గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో 108, 104 అంబు లెన్స్ వైద్య సేవలు కూడా అందడం లేదు. రోడ్డు మార్గం లేకపోవడంతో అంబులెన్స్‌లు గ్రామాలకు వెళ్లలేకపోతు న్నాయి. రోడ్డు సౌకర్యాం లేకపోవడంతో అటవీ ప్రాంత గ్రామాలకు వెళ్లేందుకు రాళ్ళరోడ్డు మార్గం ఉండటంతో ద్విచక్రవాహన దారులు సైకిల్‌పై వెళ్లే వారు కిందపడి గాయాలపాలవుతున్నారు. గిరి గ్రామాలకు రోడ్డు సౌకర్యాల కోసం వస్తున్న నిధులు ఎటుపోతున్నాయో అర్ధం కానీ పరిస్తితి. ఎన్నికలు వచ్చిన ప్రతి సారి గ్రామీణ రోడ్లు బాగు పరుస్తామని మౌళిక సదుపాయాలు కల్పిస్తామని అన్ని రంగాల్లో అభివృద్ది చేస్తామని తమ ప్రసంగాలతో అదర గోడుతు గెలుపోందిన తర్వత మరిచిపోవడం ప్రజాప్రతి నిధులకు పరిపాటిగా మారింది. ఎక్కడా వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా గిరిజన గ్రామాల్లో సమస్యలు పెరుకుపోయి ప్రగతి బాట పట్టడం లేదు. దీనికంతటికి కారణం రవాణా సౌకర్యాం లేకపోవడమే. తెలంగాణ వచ్చింది. టిఆర్‌ఎస్ సర్కార్ కొలువు దీరింది. 


రోడ్లు లేక అల్లాడుతున్న గిరిజన గ్రామాలు

ఇప్పటికైన గిరిజన గూడెల రూపురేఖలు ఏ మాత్రము మారలేదు. గూడేలు దాటి ఆదివాసీలు బాహ్య ప్రపంచంలో అడుగు పెట్టలంటే వాగులు, గుట్టలు, దాటల్సిందే. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజన గ్రామల అభివృద్ది కోసం పుష్కలంగా నిధులు విడుదల చేస్తున్న గిరి గ్రామల రహదారులు మా త్రం బాగుపడటం లేదు. ఇప్పటికైన పాలకులు, అధికారులు ఇచ్చిన హామీలకు కట్టుబడి సౌకర్యాలు మెరుగుపర్చాలనీ పేర్కొంటున్నారు. రోడ్లు బాగు చేయింది రాకపోకలకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని కోరుతున్నారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యలు పరిష్కారించాలని అధికారులకు, ప్రజాప్రతినిధులకు ఎన్నో సార్లు చెప్పినం. మా గ్రామం నుండి మండల కేంద్రానికి 15 కిలోమిటర్లు రెండు వగులు దాటలి. గ్రామస్థులందరు వాగుల వద్ద మట్టి వెసిన వర్షం నీరుతో మొత్తం కొట్టుకుపోతుంది. బ్రిడ్జి నిర్మిస్తే గాని మా సమస్యతీరాదు. నాయకులకు పలుమార్లు విన్నవించుకున్నం తోందర లోనే సమస్య పరిష్కారిస్తామం అంటారు. సంవత్సరాలు గడిచిన పరిష్కారం మాత్రం చూపండం లేదు.
గిరిజనల గోడు పట్టించుకోని సర్కార్స్వాతంత్రం వచ్చి 69 ఏళ్లు గడుస్తున్న గిరి బిడ్డల బతుకుల్లో వెలుగులు నింపే నాథులే కరువయ్యారు. ప్రభుత్వా లు ఏళ్లుగా పాలిస్తున్న గిరిజన సమస్యలపై సమగ్ర ప్రణాళికలు లేకపోవడంతో సంక్షేమ పథకాలు వారికి అందని ద్రాక్షగానే మిగిలి పోయాయి. గిరిజన బిడ్డలపై ప్రత్యేక శ్రద్ధ చూపాల్సిన అధికారులు అలసత్వ దోరణి, నిధులపై ‘మాములు’గా వ్యవహరించ డంతో వారి బతుకులు చిద్రమయ్యాయి.ఏళ్లుగా అడవి తల్లే గిరిజనులను అమ్మ లా ఆదరిస్తోంది. అడవిలో దొరికే అటవి ఉత్పత్తులతోనే ఇన్నేళ్లుగా జీవనం సాగిస్తున్నారు. అడవిలోని ఇప్ప పువ్వు, ఇప్ప పరక, టేకు సీడ్, తునీకాకు, లక్క, తేనే, బంక, వెదురు బొంగులు, వంట చెరుకు వంటి వాటిని సేకరించి అమ్ముకుంటూ చాలి చాలని జీవితాలను వెల్ల దీస్తున్నారు. అడవి తల్లే వారికి అండగా నిలబడుతుం ది. నేటి ప్రభు త్వం గిరిజనులపై పక్కా ప్రణాళికతో సంక్షేమ పథకాలు రూపొందిస్తే గిరిజనులు అభివృద్ది చెందుతారని విద్యావెత్తలు కోరుతున్నారు.

No comments:

Post a Comment