వరంగల్, ఏప్రిల్ 5(way2newstv.in)
వరుస ఎన్నికల పుణ్యమా అని ఊరూరా పలువురికి ఉపాధి లభిస్తోంది. ఇటీవలే అసెంబ్లీ, పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికల ప్రచారం షురువైంది. బరిలో నిలిచిన అభ్యర్థులు ఇప్పటికే ప్రచారం మొదలుపెట్టారు. గ్రామాల్లో తమ కార్యకర్తలతో ప్రచారం ప్రారంభించారు. నేతలు గ్రామాల్లో అడుగుపెట్టాలంటే హంగుఆర్భాటం ఉండాల్సిందే. ఫ్లెక్సీలు, జెండాలు, డప్పు చప్పుళ్లు, మైకులు, టెంట్లు, హంగామా అంత ఉండాల్సిందే. ఎన్నికల పుణ్యమా అని వీరందరికి ఉపాధి లభిస్తోంది.ఎన్నికల ప్రచారం చేయలన్నా, భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలన్నా ఈ రోజుల్లో జన సమీకరణ ఎంతో కష్టం.అన్ని పార్టీ నాయకులు ప్రచారానికి వెళ్లడం. సమయం తక్కువగా ఉండడం ఒకే రోజు ఇరు పార్టీ నాయకులు సభలు పెట్టడంతో జన సమీకరణ చేయడం చాలా పెద్ద సమస్య మారింది.
వరుస ఎన్నికలతో ఉపాధి
పొద్దున ఒకరు, సాయంత్రం ఒక్కరు సభ ఏర్పాటు చేసుకుంటే తమకు ఉపాధి లభిస్తుందని నిరుపేదలు చెబుతున్నారు. దీంతో సభకు వచ్చే వారే ఈ విషయం పార్టీ నాయకులకు చెప్పుతున్నారు. సభలకు వచ్చే జనానికి ఈ సభలతో ఉపాధి లభిస్తోంది.ఎన్నికల నేపథ్యంలో ప్రచారం చేయాలంటే ఆయా గ్రామాల్లో ముఖ్య కూడలీలలో ప్లెక్సీలు ఎంతో అవసరం. దీంతో ఆయా ప్లెక్సీ సెంటర్లకు ప్లెక్సీ అర్డర్లు పెద్ద మొత్తంలో వస్తున్నాయి. దీంతో ఉపాధి పొందుతున్నారు. ఊరూరా గొడలపై నాయకుల ఫోటోలతో,గ్రామాల్లో ఏ వీధిలో చూసిన నాయకుల ఫోటోలు దర్శనం ఇస్తున్నాయి. దీంతో ఎలాంటి ఉపాధి లేక మగ్గుతున్న తమకు ఎన్నికల పుణ్యమా అని ఉపాధి లభిస్తోందని వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.డప్పు చప్పుళ్లు లేకుండా ఏ అభ్యర్థి ప్రచారం చేసిన అంత హంగు ఆర్భాటం కనిపించదు.. ఇంటింటి ప్రచారమైన, రోడ్‌షో అయిన డప్పులు మోగాల్సిందే. ఇప్పుడు నయ ట్రేండ్‌గా కోలాటం వచ్చింది. అభ్యర్థులకు స్వాగతం పలుకాలన్నా, రోడ్‌షోలకైనా ఇప్పుడు కోలాటంతో స్వాగతం పలుకుతున్నారు. దీంతో వీరికి ఉపాధి లభిస్తోంది. అంతేకాకుండా భారీ బహిరంగ సభలో రోడ్‌షోలకు వచ్చిన జనానికి ఆహ్లద పర్చడానికి అభ్యర్థి గురించి తెల్పడానికి పాటపాడే కళాకారులు ఎంతో అవసరం.దీంతో ఎన్నికల సమయంలో తమకు ఎంతో మేలు జరుగుతుందని కళాకారులంటున్నారు. ఎన్నికల సమీపిస్తుండడంతో నిరుపేద కూలీలకు, కళాకారులకు కాసింత ఉపాధి దొరకడంపై వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
No comments:
Post a Comment