Breaking News

22/04/2019

ప్రభుత్వ ఆసుపత్రిలో సాధారణ ప్రసవాలు పెంచాలి

జగిత్యాల జిల్లా వైద్యాధికారి పి.శ్రీధర్
జగిత్యాల  ఏప్రిల్ 22 (way2newstv.in)  
ప్రభుత్వాసుపత్రుల్లో సాధారణ ప్రసవాల సంఖ్య ను పెంచాలని ,ప్రభుత్వాసుపత్రులకు వచ్చే గర్భణీల పట్ల నిర్లక్ష్యం వీడిచి ,నమ్మకం వచ్చే విధంగా సేవలు కల్పించాలని జగిత్యాల జిల్లా వైద్యాధికారి పుప్పాల శ్రీధర్ పేర్కొన్నారు. సాధారణ తనిఖీలో భాగంగా సోమవారం కోరుట్ల పట్టణంలోని సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. ఈసందర్భంగా ఆసుపత్రి సిబ్బంది ,హజరు పట్టికను ,రోగులు వైద్య ఆందించే కేసు షీట్లను తనిఖీ చేసి సిబ్బంది అందించే సేవల గురించి రోగులను అడిగి తెలుసుకున్నారు.


ప్రభుత్వ ఆసుపత్రిలో సాధారణ ప్రసవాలు పెంచాలి

ఆనంతరం వైద్యాధికారి మాట్లాడుతూ గర్భిణీల రిజిస్ట్రేషన్ ఆన్లైన్లో నమోదు ప్రకీయ గురించి సూపర్ వైజర్లులను ఆడిగి తెలుసుకున్నారు. ప్రతి గర్భిణీ వివరాలు ఆనైన్లో రిజిస్ట్రేషన్ నమోదు చేయాలని సూచించారు.గర్భిణీలు ప్రభుత్వాసుపత్రుల సేవలు వినియోగించుకునేలా ఆరోగ్య సిబ్బంది ఆవగాహన కల్పించాలన్నారు.సాధారణ ప్రసవాలను ప్రోత్సహిస్తూ హైరిస్క్ కేసులను ముందుగానే గుర్తించి జిల్లా ఆసుపత్రికి తరలించాలని సూచించారు. చిన్న పిల్లలకు ఇచ్చే వ్యాధి నిరోధక టీకాలు సరైన సమయంలో ఇవ్వలన్నారు. కేసీఆర్ కిట్ అర్హులైన వారికి అందే విధంగా చూడాలని వైద్యాధికారులకు సూచించారు.ఆయన వెంట జిల్లా ఫ్రోగాం ఆఫీసర్ డాక్టర్. పి.శ్రీపతి ,సూపరింటెండెంట్ డాక్టర్. లావణ్య, సిబ్బంది దుర్గాభవాని ,కనకలక్ష్మీ,కౌసర్ ,ఫాతీమా ,మరియం ,రబ్బానీ, మల్లికార్జున్, మనోజ్ ,రియాజ్, ఇమ్రాన్ తదితరులు ఉన్నారు..

No comments:

Post a Comment