Breaking News

22/04/2019

ఒక ప్రతి సోమవారం ప్రజావాణి

వరంగల్ అర్బన్,ఏప్రిల్,22(way2newstv.in):
ఇకనుండి ప్రతి సోమవారం ప్రజావాణి జరుగుతుందని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జె.పాటిల్ స్పష్టం చేశారు. అయితే లోక్ సభ ఎన్నికలు కౌంటింగ్ ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమై ఉండే అవకాశం ఉన్నందున మే 21 సోమవారం  మాత్రమే ప్రజావాణి ఉండదని తెలిపారు. అధికారులందరూ ప్రజావాణికి తప్పనిసరిగా తప్పనిసరిగా  హాజరు కావాలని ఆదేశించారు. సోమవారం ఎటువంటి సమీక్షలు, పర్యటనలు పెట్టుకోరాదని సూచించారు. సోమవారం కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజావాణి లో వివిధ మండలాల నుండి  వచ్చిన ప్రజల నుండి విజ్ఞాపనలను స్వీకరించి సంబంధిత అధికారులకు తగు చర్యకై సిఫారసు చేశారు.


ఒక ప్రతి సోమవారం ప్రజావాణి

ఈ సందర్భంగా అధికారులతో మాట్లాడుతూ సంక్షేమ శాఖల యూనిట్లకై ప్రభుత్వం నుండి సబ్సీడీ సొమ్ము విడుదలై నెల రోజులు అయినప్పటికి యూనిట్ గ్రౌండింగ్ లో జాప్యం పై జిల్లా కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ అంశంపై ఈ నెల 23 సాయంత్రం 4 గంటలకు  ఎస్.సి, ఇ.బి.సి. మైనారిటి సంక్షేమ శాఖల అధికారులు, ప్రధానమైన బ్యాంకుల రీజనల్ మేనేజర్లతో ప్రత్యేక సమీక్ష నిర్వహించనున్నట్లు ప్రకటించారు. యూనిట్ల గ్రౌండింగ్ పై నివేదికలు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. శాసనసభ ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన సెప్టంబర్ నుండి ఇప్పటి వరకు సదరం సర్టిఫికేట్లకై వచ్చిన దరఖాస్తులు. నిర్వహించిన సదరం పరీక్షలు, జారీ చేసిన సర్టిఫికేట్లు, తిరస్కరించిన దరఖాస్తూలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని మెప్మా పిడిలను ఆదేశించారు. అలాగే సదరం దరఖాస్తులు, జారీచేసిన సర్టిఫికేట్లు తిరస్కరించిన దరఖాస్తుల వివరాలతో డాడాబేస్ తయారు చేయాలని తెలిపారు. ఈ డాటాబేస్ తో మరల వచ్చే దరఖాస్తులను తిరస్కరించవచ్చునని తెలిపారు

No comments:

Post a Comment