Breaking News

15/04/2019

మరోమారు ఎన్నికల సందడి

అదిలాబాద్, ఏప్రిల్ 15, (way2newstv.in)
జిల్లాల్లో మరోమారు ఎన్నికల సందడి నెలకొననున్నది. పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ముగియగా జిల్లాలో మరో ఎన్నికలు త్వరలో జరిగే అవకాశాలున్నాయి. జిల్లా వ్యాప్తంగా జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణకు అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు చేయగా మూడు విడతలుగా ఈ ఎన్నికలు జరుగనున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో 17 మండలాల్లో 158 ఎంపీటీసీ స్థానాలు, 17 జిల్లా పరిషత్ ప్రాదేశిక సభ్యుల ఎన్నికల జరుగనుండగా మొదటి విడత ఎన్నికలు మే 6, రెండో విడత మే 10న, మూడో విడత మే 14న ఎన్నికలు నిర్వహించే అవకాశాలున్నాయి. పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు విడుదలయిన తర్వాత ఈ ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ జరుగనుంది. పరిషత్ ఎన్నికల నిర్వహణకు అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు చేశారు. సర్పంచ్ ఎన్నికల తరహాలోనే ఈ ఎన్నికలనూ మూడు విడతల్లో నిర్వహించే అవకాశం ఉంది. ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న 17 మండలాల్లో 158 ఎంపీటీసీ స్థానాలు, 17 జిల్లా పరిషత్ ప్రాదేశిక సభ్యుల ఎన్నిక జరుగనున్నాయి. మొదటి విడత ఎన్నికలు మే 6న, రెండో విడత మే 10న, మూడో విడత పోలింగ్ మే 14వ తేదీన నిర్వహించనున్నారు. 


మరోమారు ఎన్నికల సందడి

పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు విడుదలైన తర్వాత పరిషత్ ఎన్నికల కౌంటింగ్ నిర్వహిస్తారు. జిల్లా వ్యాప్తంగా జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు ఇప్పటికే పూర్తి చేశారు. ఎన్నికల నిర్వహణలో భాగంగా ఓటర్ల తుది జాబితాను 15 రోజుల కిందట అధికారులు విడుదల చేశారు. జిల్లాలో 17 మండలాల్లో 158 ఎంపీటీసీ స్థానాలు, 17 జిల్లా పరిషత్ ప్రాదేశిక సభ్యుల ఎన్నికల కోసం అధికారులు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లాలోని ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరిగే 17 గ్రామీణ మండలాల్లో 384544 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 189491 మంది, మహిళా ఓటర్లు 195044 మంది, ఇతరులు 9 మంది ఉన్నారు. గ్రామ పంచాయతీల వారీగా జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను మూడు విడతల్లో నిర్వహిస్తారు. మొదటి విడత ఎన్నికలు మే 6, రెండో విడత మే 10న, మూడో విడత మే 14న ఎన్నికలు నిర్వహించే అవకాశాలున్నాయి. మొదటి విడతలో ఆదిలాబాద్ నియోజకవర్గంతో పాటు బోథ్ నియోజకవర్గంలోని తాంసి, భీంపూర్ మండలాల్లో ఎన్నికలు జరుగుతాయి. రెండో విడతలో బోథ్ నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో, చివరి విడతలో ఖానాపూర్ నియోజకవర్గంలోని ఉట్నూర్, ఇంద్రవెల్లి, బోథ్ నియోజకవర్గంలోని ఇచ్చోడ, సిరికొండ, ఆసిఫాబాద్ నియోకవర్గంలోని నార్నూర్, గాదిగూడ మండలాల్లో ఎన్నికలు జరుగనున్నాయి. చివరి విడతలో ఎక్కువ ఎన్నికలు జరిగే ప్రాంతాలు ఏజెన్సీ పరిధిలోకి వస్తాయి మొదటి విడత ఎన్నికలు జరిగే మండలాల్లో ఈ నెల 22 నుంచి రెండో విడత ఎన్నికలు జరిగే మండలాల్లో 26 నుంచి మూడు విడత పోలింగ్ జరిగే ప్రాంతాల్లో 30 నుంచి నామినేషన్లు స్వీకరించనున్నట్లు తెలిసింది.ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు ఆయా మండలాల్లో నామినేషన్లు స్వీకరిస్తారు. గతంలో ఎంపీటీసీ అభ్యర్థుల నామినేషన్లు మండల పరిషత్తు కార్యాలయాల్లో స్వీకరిస్తుండగా జడ్పీటీసీ నామినేషన్‌లు జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ కార్యాలయంలో తీసుకునే వారు. దీంతో జడ్పీటీసీలుగా పోటీ చేసే అభ్యర్థులు జిల్లా కేంద్రానికి వచ్చి తమ నామినేషన్లు సమర్పించుకోవాల్సి ఉండేది. ఈ సారి జరిగే ఎన్నికల్లో ఎంపీటీసీలతో పాటు జడ్పీటీసీ నామినేషన్లను సైతం మండల పరిషత్ కార్యాలయాల్లో తీసుకుంటారు. జడ్పీటీసీ, ఎంపీటీసీల నామినేషన్ల స్వీకరణకు వేర్వేరుగా రిటర్నింగ్ అధికారులను నియమించారు. జడ్పీటీసీ నామినేషన్ల స్వీకరణకు ఓ రిటర్నింగ్ అధికారిని నియమిస్తారు. వీరితో పాటు మూడు ఎంపీటీసీ స్థానాలకు చొప్పున రిటర్నింగ్ అధికారులు ఉంటారు. జడ్పీటీసీ రిటర్నింగ్ అధికారులుగా వివిధ శాఖల జిల్లా అధికారులు, ఎంపీటీసీలకు మండల స్థాయి అధికారులు ఆర్వోలుగా వ్యవహరిస్తారు.

No comments:

Post a Comment