Breaking News

29/04/2019

ప్రజలు ఇబ్బంది పడుతున్నారు

కాకినాడ,  ఏప్రిల్ 29 (way2newstv.in)  
రాష్ట్రం లో ఎన్నికలు ముగిసిన తరువాత ఎప్పుడు లేనంతగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఎన్నికలు జరిగిన తరువాత 45 రోజులు గ్యాప్ లో ప్రభుత్వం ఎటువంటి సమీక్షలు చేయనివ్వకపోవడం తప్పని డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప అన్నారు.  సోమవారం అయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు ప్రభుత్వం ప్రజల చేత ఎన్నికైన ప్రభుత్వం అనే విషయం మరిచారా అని ప్రశ్నించారు. 


ప్రజలు ఇబ్బంది పడుతున్నారు

చీఫ్ సెక్రటరీ కి పాలన కు ఏం సంబంధం.  ప్రస్తుతం తుఫాన్ వణికిస్తోంది సహాయక చర్యలు పై సమీక్షలు చేయకూడదంటే ఎలా అని అడిగారు. ఓ వైపు తుఫాన్ వణికిస్తుంది రైతులు పంట కాపాడుకునేలా ఏం చర్యలు చేపట్టారు. సిఎం సహాయ నిధికి సంబంధించిన చెక్కులు బౌన్స్ అవుతున్నాయి.. దానికి సిఎస్ బాధ్యత వహిస్తారా అని ప్రశ్నించారు. అధికారులను గుప్పెట్లో పెట్టుకుని కేంద్రం మనపై కక్షసాధింపు చేస్తోంది. ఎవరెన్ని లెక్కలు వేసిన తెలుగుదేశం పార్టీ మరోసారి అధికారంలోకి ఖాయమని అన్నారు. 

No comments:

Post a Comment