Breaking News

29/04/2019

వేంపల్లె లో త్రాగు నీరు రోడ్డు పాలు

23 గ్రామాలకు సరఫరా చేసే పైపులైన్ లీక్
పట్టించుకోని  సంబంధిత అధికారులు
కడప,   ఏప్రిల్ 29 (way2newstv.in)  
అసలే ఎండాకాలం, ప్రజలు మంచి నీటి కోసం అల్లాడుతుంటే మరోవైపు మంచి నీటి పైపులైన్ లీకై నీరు రోడ్డు పాలవుతున్నా పట్టించు కోని పంచాయతీ అధికారుల, సిబ్బంది అలసత్వంపై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. తాగునీటి కోసం ప్రజలు అల్లాడిపోతుంటే వేంపల్లె మండలంలోని 23 గ్రామాలకు సరఫరా చేసే  మంచి నీటి పైపులైన్లు లీకై వేల లీటర్ల నీరు ప్రజల దాహర్తిని తీర్చకుండా వృథాగా రోడ్డు పాలవుతోంది. 


వేంపల్లె లో త్రాగు నీరు రోడ్డు పాలు

సోమవారం  ఉదయం నుంచి పులివెందుల రోడ్డులోని గంటన్న ఇట్టుకల బట్టి సమీపంలో  పాపాఘ్న నది నుంచి సరఫరా చేసే మంచి నీటి పైపులైన్ లీకేజీ కావ డంతో విలువైన మంచి నీరు వృథాగా పోతుంది. వేసవి కాలం కావడంతో చాలా గ్రామాల్లో  నీటి ఎద్దడి పెరిగింది. ప్రజలు మంచి నీటి కోసం దాహం కేకలు వేస్తున్నారు. మరోవైపు పంచాయతీ సిబ్బంది, అధికారుల  అలసత్వంతో పైపు లీకై మంచి నీరు రోడ్డుపాలవుతున్నా పట్టించుకోకుండా వ్యవహరి స్తున్న తీరుపట్ల పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వేంపల్లె మండల కేంద్రంలోని చాలా గ్రామాల్లో మంచి నీటి సమస్య తీవ్రంగా ఉంది.  తక్షణమే వేంపల్లె లో వృథాగా పోతున్న మంచి నీటి లీకేజీని అరికట్టి కనీసం నీరు అందని గ్రామాలకు సక్రమంగా మంచి నీరు సరఫరా అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను, పాలకులను స్థానిక ప్రజలు వేడుకుంటున్నారు.

No comments:

Post a Comment