Breaking News

29/04/2019

ఏపీలో తొలి తెలుగు చిత్ర నిర్మాణం ప్రారంభం

విజయవాడ, ఏప్రిల్29 (way2newstv.in)  
ఆంధ్ర ప్రదేశ్ లో పూర్తిస్థాయి  తెలుగు చిత్రం నిర్మించడం ఆనందం గా ఉందని కృష్ణకాంత్ క్రీయేషన్ అధినేత వల్లూరిపల్లి వేంకటేశ్వరావు పేర్కోన్నారు.సోమవారం బందర్ రోడ్డులోని పివిఆర్ రిప్పర్ లో  తోలి తెలుగు చిత్రం  కృష్ణ కాంత్ క్రీయేషన్ వల్లూరిపల్లి నాగజ్యోతి నిర్మిస్తున్న అభిలాష చిత్రంను ఫిజో గ్లాస్ ప్రైవేట్ ఇండియా లిమిటెడ్ ఎం. డి జైన్ క్లాప్ కొట్టి సినిమా షెడ్యూల్  ప్రారంబించారు.ఆనంతరం సినిమా దర్శకుడు బీమ్ జి ఆచంట మాట్లాడుతూ  రెండు షెడ్యూల్ ల్లో సినిమా పూర్తి చేసి దసరా పండుగ కు రిలీజ్ చేస్తామని తెలిపారు. మొదటి షెడ్యూల్ విజయవాడ,నూజివీడు పరిసరాల్లో చిత్రీకరణ జరుపుతామని తెలిపారు.


ఏపీలో  తొలి తెలుగు చిత్ర నిర్మాణం ప్రారంభం

రెండవ షెడ్యూల్ గోదావరి,భద్రాచలం లో చిత్రికరిస్తామని చెప్పారు.ఫ్యామిలి డ్రామా,యుత్ ఎంటర్టైనమెంట్ తో ఈ సినిమా అన్ని వర్గాలను ఆకట్టుకునే రీతిలో ఉంటుందని తెలిపారు.తన మొదటి సినిమా 'గోదావరి నవ్వింది' అని త్వరలో రిలీజ్ కానుందని చెప్పారు.  ఆనంతరం సినిమా హీరో లక్ష్మీస్ భట్ మాట్లాడుతూ స్వర్ణ ఖడ్గం సీరియల్ లో  హీరోగా చేశానన ఈ సీరియల్ నాలుగు భాషలలో వస్తుందని తెలిపారు.  అభిలాష లాంటి పవర్ పూల్ టైటిల్ తో వస్తున్న ఈ సినిమా కథ విని ఎంతో ఉత్కంఠకు గురియైయానని తెలిపారు.హిరోయిన్ గా ముంబై కు చెందిన వైభవి,రవి ప్రకాష్,తనికెళ్ల భరణి,శుభలేఖ సుధాకర్,శ్రీనివాస్,ఇతర నూతన నటీనటులు నటిస్తారని తెలిపారు .సినీనటుడు పివిఆర్ చౌదరి మాట్లాడుతూ ఈ సినిమా మంచి విజయాన్ని నమోదు చేసుకుంటుందని చెప్పారు.మహేష్ బాబుతో భరత్ అను నేను ,రంగులరాట్నం,ధృవ లాంటి సినిమాల్లో నటించానని తెలిపారు. ఈ సినిమా తమిళ్ డబ్బింగ్ రైట్స్ తనకు ఇవ్వాలని ద్రోణాల సత్యనారాయణ కోరారు.  కార్యక్రమానికి విజయవాడ తూర్పు శాసనసభ సభ్యులు గద్దె రామ్మోహన్ రావు ముఖ్య అతిధిగా పాల్గోన్నారు. మొదట కార్యక్రమాన్ని సౌత్ ఇండియా సినిమా ప్రోడ్యూసర్స్ ఇ.సి మెంబర్ వాసంతి జ్యోతి ప్రజ్వలన గావించారు.ఈ కార్యక్రమంలో ఏమ్మెస్ చౌదరి,పెంటి నాగరాజు తదితరులు పాల్గోన్నారు

No comments:

Post a Comment