Breaking News

02/04/2019

అదనపు బ్యాలేట్ యూనిట్ల ర్యాండమైజేషన్ ప్రక్రియ పరిశీలన

పెద్దపల్లి, ఏప్రిల్ 02 (way2newstv.in)
 జిల్లాలో పార్లమెంట్ ఎన్నికల నిర్వహణ కోసం కేటాయించిన 563 అదనపు బ్యాలేట్  యూనిట్ల మొదటి దశ  దృవీకరణ పూర్తి  చేసుకొని  జరుగుతున్న   ర్యాండమైజేషన్  ప్రక్రియ,  జిల్లాలో ఎన్నికల కోసం సిద్దం చేసుకున్న బ్యాలేట్  యూనిట్లలో సింబలింగ్ అమర్చే ప్రక్రియను మంగళవారం జేసి పరిశీలించారు. 


అదనపు బ్యాలేట్  యూనిట్ల ర్యాండమైజేషన్ ప్రక్రియ పరిశీలన

పెద్దపల్లి మార్కెట్  యార్డులో  అదనపు బ్యాలేట్  యూనిట్ల  ర్యాండమైజేషన్ మరియు  బ్యాలేట్  యూనిట్లలో  ఎన్నికల సింబల్ ఎర్పాటు చేసే ప్రకియను పరిశీలించి,  ర్యాండమైజేషన్ ప్రక్రియను ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు పూర్తి చేయాలని అధికారులకు తగు సూచనలు అందించారు.  సింబల్స్ ఎర్పాటు చేసిన అనంతరం బ్యాలేట్  యూనిట్లను జాగ్రత్తగా భద్రపరుస్తు  ర్యాండమైజేషన్ ప్రకారం  అసెంబ్లీ సెగ్మెంట్లకు తీసుకొని వెళ్లాలని, సాంకేతిక సమస్యలు ఉత్పన్నం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని,  ఈవిపం  యంత్రాల పై నివేదికలను ఎప్పటికప్పుడు తయారు చేయాలని జేసి తెలిపారు.    కలెక్టరేట్ సి సెక్షన్  సూపరిండెంట్ పాల్ సింగ్,  బెల్ ఇంజనీర్లు, సంబంధిత అధికారులు, తదితరులు జేసి వెంట వున్నారు.

No comments:

Post a Comment