Breaking News

02/04/2019

మోడీకి దేశంలో ఉండే అర్హత లేదు

చిత్తూరు, ఏప్రిల్ 2, (way2newstv.in)
నరేంద్ర మోదీని ఢిల్లీ నుంచి గుజరాత్ పంపే దాకా వదిలపెట్టనని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. చిత్తూరు జిల్లా మదనపల్లిలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆయన.. ప్రధాని మోదీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. గ్రామంలో ఉండే కార్యకర్తలు మోదీ కంటే వెయ్యి రెట్లు నయం అన్న చంద్రబాబు.. పోలవరానికి డబ్బులు కూడా ఇవ్వలేదన్నారు. పోలవరం ప్రాజెక్ట్‌కు రూ.58 వేల కోట్లు అవసరమైతే.. ముష్టి రూ.7 వేల కోట్లు ఇచ్చారు. మిగిలింది ఎవరిస్తారు? మీ ఇంట్లో నుంచి డబ్బులు తేవడం లేదు.. నీ అబ్బ సొమ్ము కాదని బాబు ఘాటుగా వ్యాఖ్యానించారు. ‘పోలవరం ప్రాజెక్ట్‌కు జాతీయ హోదా కాంగ్రెస్ వాళ్లు పెట్టారు. మీరు పెట్టలేదు. మోదీ నోరు తెరిస్తే అబద్ధాలే. పోలవరం నిర్మాణానికి 40-50 ఏళ్లు పడుతుందన్నారు. కానీ నేను సవాల్ చేస్తున్నా.. ఈ ఏడాది జూలైలో గ్రావిటీతో నీటిని తీసుకొస్తా అని చంద్రబాబు తెలిపారు.తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఆర్కియాలజీ విభాగానికి అప్పగించే ప్రయత్నం చేశారు. వెంకటేశ్వర స్వామిని కూడా హస్తగతం చేసుకోవాలని ప్రయత్నించారు. కానీ బీజేపీ వాళ్లు వెంకటేశ్వర స్వామి జోలికి వెళ్తే షాక్ కొడుతుందని బాబు హెచ్చరించారు.


మోడీకి దేశంలో ఉండే అర్హత లేదు

మోదీని కరుడు గట్టిన ఉగ్రవాదితో పోల్చిన బాబు.. మైనార్టీలెవరూ మోదీకి ఓటేయొద్దని కోరారు. ‘గోద్రాలో 2 వేల మందిని చంపేశారు. ఆయనకు ఈ దేశంలో ఉండేందుకు అర్హత లేదు, రాజీనామా చేయాలని డిమాండ్ చేసిన తొలి వ్యక్తిని నేనే. ఆ తర్వాత ప్రపంచ దేశాలు ఆయన రాకుండా నిషేధించాయి. ప్రధాని కాగానే ఆయనకు కొమ్ములొచ్చాయి’ అని బాబు విమర్శించారు. ఒక్కసారి తనను గెలిపించాలని ప్రజలను వైసీపీ అధినేత జగన్ కోరుతుండటంపై ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఘాటుగా స్పందించారు. చిత్తూరు జిల్లా మదనపల్లెలో నిర్వహించిన టీడీపీ ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ, ఒక్కసారి తినే తిండిలో విషం కలుపుకుంటామా? కొండపై కెక్కి లోయలో దూకుతామా? అని ప్రజలను ప్రశ్నించారు. భావితరాల భవిష్యత్ కు సంబంధించిన అంశం పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. జగన్ పేరులోనే ‘గన్’ ఉందని, జగన్ కు ఎప్పుడూ నేరాలు, ఘోరాలు, కుట్రలేనని విమర్శించారు. ‘జగన్ మోహన్ రెడ్డికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయో తెలుసా? మోదీ, కేసీఆర్ నుంచి’ అని చెప్పారు.హైదరాబాద్ నుంచి వలస పక్షులు వస్తున్నాయని, వలస పక్షులతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజలు వైసీపీని నమ్ముకుంటే జైలుకు పోతారని, పవన్ పార్టీని నమ్ముకుంటే అత్తారింటికి పోతారని, అదే, తనను నమ్ముకుంటే ప్రజల భవిష్యత్ బ్రహ్మాండంగా తీర్చే బాధ్యత తనదని హామీ ఇచ్చారు. ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలన్నీ భర్తీ చేసే బాధ్యత తనదని అన్నారు. ఏపీలో ఉండే పత్రికా విలేకరులందరికీ ఇళ్లు కట్టిస్తామని మరోసారి స్పష్టం చేశారు.

No comments:

Post a Comment