Breaking News

02/04/2019

ప్రచార ఖర్చులపై నిఘా

వరంగల్ అర్బన్, ఏప్రిల్, 02 (way2newstv.in)
అభ్యర్ధులు ప్రచార ఖర్చులను లెక్కిస్తున్న తీరుతెన్నులను తనిఖీచేసేందుకు వరంగల్ లోక్ సభ స్ధానానికి ప్రత్యేక వ్యయ పరిశీలకులుగా రిటైర్డ్  ఐఆర్ ఎస్ అధికారి గోపాల్ ముఖర్జీ ని భారత ఎన్నికల  సంఘం నియమించింది. .  మంగళవారం వరంగల్ కు చేరుకున్న  గోపాల్ ముఖర్జీ, రిటర్నింగ్ అధికారి,  కలెక్టర్ ప్రశాంత్  జె.పాటిల్,  వ్యయ పరిశీలకులు నరేష్ కుమార్ సైనీ, విజయ్ అగర్వాల్, జిల్లా వ్యయ పరిశీలన నోడల్ ఆఫీసర్ , సంయుక్త కలెక్టర్ యస్. దయానంద్, అసిస్టెంట్ కలెక్టర్ బి. సంతోష్, కలెక్టర్ మనుచౌదరీ లతో కలసి కలెక్టరేట్ కాంప్లెక్స్ లో నెలకొల్పిన ఎన్నికల మీడియా సెంటర్ నుసందర్శించారు. 


 ప్రచార ఖర్చులపై నిఘా

మీడియా సర్టిఫికేషన్, మానిటరింగ్ కమిటీ వివరాలు, క్లిప్పింగ్ లు అభ్యర్ధులకు రిటర్నింగ్ అధికారి జారీచేస్తున్న నోటీసులను పరిశీలించారు. అలాగే కేబుల్ నెట్ వర్క లలో ప్రసారం అవుతున్న వార్తలు, ప్రకటనలు, స్క్రోలింగ్ లను 24 గం రికార్డు చేసేందుకు కల్పించిన వసతులను పరిశీలించారు.  మీడియా సెంటర్ నిర్వహణ పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా  ప్రశాంత్ పాటిల్ మాట్లాడుతూ ఇప్పటి వరకు 10 చెల్లింపు వార్తలను అభ్యర్ధల ఎన్నికల ప్రచార ఖర్చులో జమచేసినట్లు తెలిపారు. ఈ కమిటీలో సభ్యులుగా కేంద్ర సమాచార ప్రసార  మంత్యుశాఖకు చెందిన ఆల్ ఇండియా రేడియో ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ సమాచార పౌరసంబ్ ధాల శాఖ డివైఇఐఇ పి. భూపాల్ తో పాటు సోషల్ మీడియా వాట్సప్, ట్విట్టర్, యూ ట్యూబ్ లలో వచ్చే ప్రచార వార్తలు, ప్రకటనలు పరిశీలించుటకు ఎన్ ఐ పి డిఐవో వి.విజయ్ కుమార్ ను నియమించినట్లు తెలిపారు.

No comments:

Post a Comment