Breaking News

01/04/2019

చంద్రబాబు..తన హెరిటేజ్ కాపాడుకోవడమే పని

రాజమండ్రి, ఏప్రిల్ 1, (way2newstv.in)
ఏపీ హెరిటేజ్ ను కాపాడటం తమ పని అని, అయితే, తన ‘హెరిటేజ్’ ను కాపాడుకోవడం ఏపీ సీఎం చంద్రబాబు పని అంటూ ప్రధాని మోదీ విమర్శించారు. రాజమహేంద్రవరంలో నిర్వహించిన బీజేపీ ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ, టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్ పార్టీలకు ప్రజా సంక్షేమం అవసరం లేదని విమర్శించారు. తమ ప్రభుత్వ పనితీరు చూసి ప్రజలు నిర్ణయం తీసుకోవాలని, దేశం కోసం నిస్వార్థంగా సేవ చేసే బీజేపీని దీవించాలని కోరారు. 21వ శతాబ్దంలో దేశాన్ని ముందుకు నడిపించేందుకు సహకరించాలని, శక్తివంతమైన భారతదేశ నిర్మాణానికి ప్రజలందరూ చేతులు కలపాలని కోరారు.ఉగ్రవాదుల గడ్డపైకి వెళ్లి మరీ వారిపై దాడులు చేశామని, ఈ ఘనత తమ ప్రభుత్వానిదేనని, కొందరు నేతలు మాత్రం పొరుగుదేశానికి మద్దతు పలుకుతున్నారని విమర్శించారు.యు-టర్న్ బాబుకు పోలవరం ప్రాజెక్టు ఓ ఏటీఎంలా మారిందని ఆరోపించారు. 


చంద్రబాబు..తన హెరిటేజ్ కాపాడుకోవడమే పని

ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలన్న చిత్తశుద్ధి రాష్ట్ర ప్రభుత్వానికి లేదని అన్నారు. చంద్రబాబు పాలన అధర్మం, అన్యాయంగా మారిందని, మరోసారి అధికారంలోకి వచ్చేందుకు బాబు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారని, ఆయన మాటలను ఏపీ ప్రజలు ఎప్పటికీ నమ్మరని విమర్శించారు. యు-టర్న్ బాబు పరిస్థితి ‘బాహుబలి’ సినిమాలో భల్లాలదేవుడిలా ఉందని మోదీ సెటైర్లు విసిరారు. తాము అధికారంలోకి వచ్చాక తొలి కేబినెట్ భేటీలోనే పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించామని, ఈ ప్రాజెక్టు కోసం ఇప్పటివరకు రూ.7 వేల కోట్లు విడుదల చేశామని స్పష్టం చేశారు. కేంద్రం నిధులు మంజూరు చేసినా ఇక్కడి ప్రభుత్వం ఈ ప్రాజెక్టును పూర్తి చేయలేదని విమర్శించారు. ‘పోలవరం’ అంచనా వ్యయాలు క్రమంగా పెరుగుతూ పోతున్నాయని అన్నారు. 

No comments:

Post a Comment