Breaking News

01/04/2019

గులాబీకి ఓటేస్తే..అది మోడీకే

హైద్రాబాద్, ఏప్రిల్ 1, (way2newstv.in)
ఈ నెల 11న జరగబోయే లోక్ సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు ఓటేస్తే మోదీ, బీజేపీ, ఆర్ఎస్ఎస్ కు వేసినట్టేనని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్ లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతూ, ఎన్నికల ముందు బీజేపీ, టీఆర్ఎస్ డ్రామా నడిపిస్తున్నాయని చెప్పారు. ఎన్నికల ప్రచార సభల్లో మోదీని కేసీఆర్ తిట్టడం, కేసీఆర్ ని మోదీ తిట్టడం ఒట్టి డ్రామాగా అభివర్ణించారు. చౌకీదార్ మోదీ ‘దొంగ’ అని కేసీఆర్ ఎప్పుడైనా అన్నారా? అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా మోదీపై రాహుల్ నిప్పులు చెరిగారు. నల్లకుబేరులపై చర్యలు తీసుకుంటామని, నల్లధనాన్ని వెనక్కి తీసుకొస్తామన్న మోదీ హామీలు ఏమయ్యాయి? అని ప్రశ్నించారు. రాత్రికి రాత్రే రూ.500, రూ.1000 నోట్లు రద్దు చేశారని, పెద్ద నోట్ల రద్దుతో నల్లధనం వెనక్కి రాలేదని విమర్శించారు.


గులాబీకి ఓటేస్తే..అది మోడీకే

పేదలు, మధ్యతరగతి ప్రజలు, చిరు వ్యాపారులు ఇబ్బందులు పడ్డ విషయాన్ని గుర్తుచేశారు.సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్ లో ఈరోజు నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ, టీఆర్ఎస్ సర్కార్ రిమోట్ మోదీ చేతిలో ఉందని అన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు. రాఫెల్ కుంభకోణంపై కేసీఆర్ మాట్లాడారా? గబ్బర్ సింగ్ ట్యాక్స్ (జీఎస్టీ) విషయంలో మోదీని కేసీఆర్ సమర్థించలేదా? అని ప్రశ్నించారు. త్వరలో జరగబోయే లోక్ సభ ఎన్నికలను కాంగ్రెస్-బీజేపీ మధ్య యుద్ధంగా రాహుల్ అభివర్ణించారు.మోదీ దేశానికి కాదు అనిల్ అంబానీ, నీరవ్ మోదీలాంటి వారికే చౌకీదార్ అని, దొంగలకు ఆయన మద్దతు ఇస్తున్నారని రాహుల్ ఆరోపించారు. ప్రతి ఒక్కరి అకౌంట్ లో రూ.15 లక్షలు వేస్తానని చెప్పిన మోదీ మోసం చేశారని, అబద్ధాలు చెప్పడంలో ఆయన్ని మించిన వారు లేరని విమర్శించారు. దేశానికి న్యాయం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని, తాము అధికారంలోకి వస్తే ప్రతి పేదోడి అకౌంట్ లో ఏడాదికి రూ.72 వేలు వేస్తామని హామీ ఇచ్చారు. పేదలపై మోదీ సర్జికల్ స్ట్రయిక్స్ చేశారని, తాము మాత్రం పేదరికంపై ఆ స్ట్రయిక్స్ చేస్తామని అన్నారు. పేదలు, రైతులకు న్యాయం చేసేది కాంగ్రెస్ పార్టీ ఒక్కటేనని రాహుల్ మరోసారి వ్యాఖ్యానించా

No comments:

Post a Comment