Breaking News

04/04/2019

తిమ్మాపురంలో ప్రదీప్ రెడ్డి ఇంటింటి ప్రచారం

మంత్రాలయం, ఏప్రిల్ 4, (way2newstv.in)  
మంత్రాలయం మండల పరిధిలోని తిమ్మాపురం, మాధవరం తాండ, వగరూరు గ్రామాలలో సింగిల్ విండో అధ్యక్షుడు వైఎస్సార్ సీపీ రాష్ట్ర యువజన నాయకులు వై ప్రదీప్ కుమార్ రెడ్డి  మాధవరం రాఘవేంద్రరెడ్డి ఇంటింటి ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా వారు ఇంటింటికి వెళ్లి జగనన్న ముఖ్యమంత్రి అయితేనే ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందని ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందాలంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిని చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందని అలాగే మంత్రాలయం నియోజకవర్గంలో బాలనాగ రెడ్డి ని ఎమ్మెల్యేగా అత్యధిక మెజారిటీతో గెలుపించాల్సిన భాద్యత ప్రతిఒక్కరిపై ఉందని వారు ఓటర్లకు సూచించారు. తిక్కా రెడ్డి బాలనాగిరెడ్డి చేతిలో ఘోరంగా ఓడిపోతాననే భయం తోనే  తన గన్ మేన్లతో కల్పించుకొని ఆస్పత్రి పాలయ్యాడు అని బాల నాగిరెడ్డి కుటుంబీకులే కాల్చారని అబద్దపు  ప్రచారాలతో ప్రజలను మభ్య పెట్టాలని చూస్తున్నారని ఇప్పుడే ఇన్ని అబద్ధాలు చెప్పే వ్యక్తి  రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకా ఎన్ని అబద్ధాలు చెప్పి ప్రజలను మభ్య పెడతారో అని ఎద్దేవా చేశారు. 


తిమ్మాపురంలో ప్రదీప్ రెడ్డి ఇంటింటి ప్రచారం    

అంబులెన్స్ లో స్ట్రెచర్ మీద వచ్చి ఓట్లు అడుక్కుంటే ఓట్లు పడవని ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేయాలని ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేసే కుటుంబమే మా రాంపురం రెడ్డి సోదరుల కుటుంబమని, మా కుటుంబం ఎల్లప్పుడూ ప్రజల సేవ లోనే ఉంటుందని ఆ విషయం నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసునని అన్నారు. తిక్కారెడ్డి తమ్ముడు శ్రీనివాస్ రెడ్డి  అధికారం లేకపోయినా కూడా  పర్సెంటేజీ లతోనే  లక్షలకు లక్షలు  వెనకేసుకు ఉన్నాడని ప్రతి పనికి పర్సెంటేజీ తీసుకుంటాడని ఆ విషయం  మంత్రాలయం నియోజకవర్గం లో ప్రజలందరికీ కూడా తెలుసని అన్నారు.   ఇలాంటి వాళ్లు అధికారంలోకి వస్తే  జనాలను పీక్కు తింటారు అని  ప్రజలను రెచ్చగొట్టి  గొడవలకు కారణం అవుతారని  ఇటువంటి వారికి ఓట్లు వేసి గెలిపిస్తే చల్లగా ఉండే మంత్రాలయం నియోజకవర్గం రావణకాష్టం అవుతుందని ఆయన విమర్శించారు. నియోజకవర్గ ప్రజలందరినీ పార్టీలకు అతీతంగా అందరినీ ఒకే రకంగా చూసి అందర్నీ ఆదుకుని ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి గారిని  ఎమ్మెల్యేగా అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన ఓటర్లను కోరారు.  ఈ కార్యక్రమంలో  మండల కన్వీనర్ బీమిరెడ్డి, సుగురు కరణం గోపాలరావు స్వామి,  కాంతరెడ్డి, నారాయణపురం ఎంపిటిసి గురురాజు,  తిమ్ములు  ఇంకా వందలాది మంది కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

No comments:

Post a Comment