Breaking News

04/04/2019

వీడియో కాన్ఫరెన్స్ ల ద్వార ఎన్నికల ప్రచారం

కొత్త వరవడికి నాంది పలికిన నారా భువనేశ్వరి
విజయవాడ ఏప్రిల్ 4  (way2newstv.in)
ఎన్నికల వేళ రాజకీయ నేతల కుటుంబీకులు కూడా ప్రచారాలకు పూనుకోవడం కొత్తది ఏమీ కాదు. ఈ విషయంలో ముఖ్య నేతల కుటుంబీకులు కూడా మినహాయింపు కాదు. ఇది గతం నుంచి ఉన్నదే. అనేక మంది నేతల కుటుంబీకులు ఎన్నికల ప్రచారం చేస్తూ తమ వారిని గెలిపించాలని ప్రచారం చేస్తూ ఉంటారు. రాజకీయంలోఇదిరొటీనే. కాని ప్రత్యేకించి ముఖ్య నేత కుటుంబీకులు వారి సొంత నియోజకవర్గాల పరిధిలో ప్రచారం చేస్తారు. ఆ నేతలు రాష్ట్రమంతా తిరుగుతూ ఉంటే.. వారి కుటుంబీకులు వారు పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో ప్రచారం చేసి గెలిపించే పనిలో ఉంటారు. 

 
వీడియో కాన్ఫరెన్స్ ల ద్వార ఎన్నికల ప్రచారం

ఈ పనే కానీ.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి కాస్త భిన్నంగా చేస్తూ ఉన్నారు.ఆమె ఇంటింటి ప్రచారానికో - లేక రోడ్ షోల కో వెళ్లడం లేదు. కుప్పంలో చంద్రబాబు నాయుడు గెలుపు కోసం ఆమె ప్రత్యక్ష ప్రచారం కాకుండా.. వీడియో కాన్ఫరెన్స్ కు దిగడం విశేషం. కుప్పంలోని టీడీపీ కార్యకర్తలతో నారా భువనేశ్వరి ప్రత్యేకంగా వీడియో కాన్ఫరెన్స్ ను నిర్వహించారు. బాబుకు భారీ మెజారిటీ తీసుకురావాలని ఆమె వారికి ఉద్భోదించినట్టుగా తెలుస్తోంది. గతంలో పోలిస్తే ఈ సారి బాబుకు ఎక్కువ మెజారిటీ రావాలని లక్ష ఓట్ల మెజారిటీని తీసుకురావాలని ఆమె వారికి పిలుపునిచ్చారట. మొత్తానికి చంద్రబాబు నాయుడు సతీమణి ఇలా వీడియో కాన్ఫరెన్స్ ప్రచార పర్వాన్ని సాగించడం కొత్త వరవడికి నాంది పలికారు.

No comments:

Post a Comment