ఎమ్మిగనూరు, ఏప్రిల్ 4, (way2newstv.in)
ముస్లిం మైనార్టీల అభివృద్ధి తె.దే.పా తోనే సాధ్యమని ముస్లిం మైనార్టీల నాయకుడు కె.ఎం.డి ఫరూక్ అన్నారు. ఇంటింటి ప్రచారంలో భాగంగా గురువారం ఉదయం వార్డు కౌన్సిలర్లతో, తేదేపా నాయకులతో కలసి పట్టణంలోని మైనార్టీ కాలనిలో ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు.
మైనార్టీల అభివృద్ధి టీడీపీతోనే సాధ్యం..
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దుల్హన్ పథకానికి అందిస్తున్న నగదును రూ.50వేల నుండి రూ.లక్ష రూపాయల వరకు పెంచుతామని ప్రకటించారన్నారు. రానున్న ఎన్నికల్లో తేదేపా గెలిచిన వెంటనే అమలు చేస్తారన్నారు. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి,సంక్షేమం చూసి ప్రతి ఒక్కరు మన ఎమ్మెల్యే అభ్యర్థి బి.వి జయనాగేశ్వర రెడ్డి,ఎం.పి అభ్యర్థి కోట్లసూర్యప్రకాష్ రెడ్డి లా సైకిల్ గుర్తుకు 2 ఓట్లను వేసి, వేయించి అత్యధిక మెజార్టీతో తెలుగుదేశం పార్టీని గెలిపించాలని వారు కోరారు.ఈ కార్యక్రమంలో ముస్లిం మైనార్టీ నాయకులు, తెదేపా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment