Breaking News

30/04/2019

సీఎస్ పై నిందలు ఆపండి

శ్రీకాకుళం  ఏప్రిల్ 30  (way2newstv.in
ముఖ్యమంత్రి చెప్పే ప్రతిపనిని ప్రభుత్వ ప్రధానకార్యదర్శి చేయరు. ముఖ్యమంత్రికి సిఎస్ సలహాదారు మాత్రమే. ఎల్వీ సుబ్రమణ్యంతో నేను కలసి పనిచేశాను.ఆయన చాలా నిబధ్దతతో పనిచేస్తారు. సిఎస్ పై నిందలు ఆపండి ఇది మంచిది కాదని వైకాపా సినీయర్ నేత ధర్మాన ప్రసాదరావు అన్నారు. మంగళవారం అయన మీడియాతో మాట్లాడారు. ఐఏఎస్ అంటే ఐ అగ్రి సార్ అని అనమంటారు మీరు. అది కాదు వారి విధి. చట్టప్రకారం పాలన నడుస్తుందా లేదా అనేది చెప్పడం వారి బాధ్యతఅని అయన అన్నారు. చంద్రబాబు ఇటీవల వితండ వాదనలకు దిగుతున్నారు. తన వైఫల్యాలకు ప్రధానినరేంద్రమోదిగారే కారణం అని చెబుతుంటారు. అదే ప్రధానిని దేశంలోఎవరూప్రశంసించనంతగా చంద్రబాబుప్రశంసించారు. జగన్ గారిని,చివరకు ఈవిఎంలను కూడా తప్పుపడుతున్నారు. ఏపిలో ఈసినిబందనలకు విరుద్దంగా వ్యవహరిస్తున్నారని టిడిపి వాదన చేస్తోంది. చంద్రబాబు 40 ఏళ్ల అనుభవం చెబుతుంది ఇదేనా అని ప్రశ్నించారు.  ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికలు జరగాలి.


సీఎస్ పై నిందలు ఆపండి

అలా జరగకపోతే ప్రజలకు ఆ వ్యవస్దపై నమ్మకం పోతుంది.  మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అమలులోకి వచ్చినపుడు ఈసి ఆదేశాలు పాటించాలా? లేక మీ ఆదేశాలు పాటించాలా? మన చట్టాలను గౌరవించక్కర్లేదని మీ పాలన తెలియచేసింది. రాజ్యాంగంపై మీకు నమ్మకం లేని విధంగా పాలన చేశారు. రాజ్యాంగం వ్యవస్దలను నాశనం చేశారు.స్పీకర్ వ్యవస్దను కూడా భ్రష్టు పట్టించారు. రాజధాని నిర్మాణంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను తుంగలో తొక్కి స్విస్ ఛాలెంజ్ పద్దతిని అమలు చేశారు. బిజేపితో ఉన్నన్ని రోజులు ప్రధానినరేంద్రమోదిని పొడిగారు. మీరు జూన్ 8 వరకు ముఖ్యమంత్రిని ప్రభుత్వం నాదే అని చెబుతున్నారు. అది తప్పు .ప్రజలకు క్లారిఫై చేయాలనే భాద్యత ప్రతిపక్షంగా మా పై ఉంది. రాజ్యాంగం ఆర్టికల్ 172 లో ఏం చెబుతుంది.చూడండి. శాసనసభ మీరు ప్రమాణ స్వీకారం చేయడంతో (ఆ తేదీతో)ఐధు సంవత్సరాలు మొదలవుతుందని మీరు అనుకుంటున్నారు. -మన రాష్ర్టంలో 2014లో మే ఏడో తేదీన ఎన్నికలు జరిగితే 16 వతేదీన ఫలితాలు వెలువడ్డాయి రాష్ర్ట శాసనసభ 2014, మే 20 వతేదీన కానిస్టిట్యూట్ అయింది.అది అపాయింటెడ్ డేట్. గడచిన ప్రభుత్వ కాలపరిధి మే20 వతేదీతో పూర్తి అవుతుంది. ప్రమాణస్వీకార తేదీతో సంభందం ఉండదు.రాజ్యాంగాన్ని చూసుకుని మీరు చెప్పింది తప్పు అని ప్రజల ఎదుట అంగీకరించాలని కోరుతున్నామని అయన అన్నారు. ఎన్నికల కాలంలో అధికారులను నిర్వీర్యం చేసే పని చేయద్దు. మీరు ఆ వ్యవస్దలోనే సిఎం అయ్యారు.ఆ వ్యవస్ద పటిష్టంగా ఉండటం వల్లనే సిఎం అయ్యారు. 40 సంవత్సరాల అనుభవం ఉన్న వ్యక్తిలా ప్రవర్తించండి. చిన్నపిల్లాడిలా మాట్లాడద్దని అన్నారు. సివిల్ సర్వెంట్స్ ను హింసించే విధంగా వ్యవహరించడం మంచి సంప్రదాయం కాదు. తర్వాత వచ్చే జనరేషన్ కు ఇదేనా మీరు ఇచ్చే సందేశమని అడిగారు. 

No comments:

Post a Comment