Breaking News

30/04/2019

తీవ్ర తుపాన్గా మారిన ఫోనీ

విశాఖపట్నం,  30  (way2newstv.in
మచిలీపట్నం తీరం నుంచి 757 కిలోమీటర్ల దూరంలో ఫోనీ తూపాన్ కేంద్రీ కృతమైంది.  ఆగ్నేయ దిశగా వేగంగా పయనిస్తున్న తుపాన్ తో  సముద్రం అల్లకల్లోలంగా మారింది.  జాలర్లు ఎవరూ చేపల వేటకు వెళ్లరాదు.  ప్రజలెవ్వరూ కూడా తీర ప్రాంతాలకు వెళ్లరాదని రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (ఆర్టీజీఎస్) హెచ్చరించింది.  మన రాష్ట్రంపై ప్రభావం తక్కువే. 


తీవ్ర తుపాన్గా మారిన ఫోనీ

శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం  వుంది. తుపాన్ ప్రభావం వల్ల 2, 3వ తేదీల్లో ఉత్తరాంధ్రలో గాలుల ప్రభావం ఉంటుంది.   గంటకు 50 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో వీచే సూచనలు వున్నాయి.  తుపాన్ గమనాన్ని నిశితంగా పరిశీలిస్తున్న రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ  ఎప్పటికప్పుడు యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తుంది. 

No comments:

Post a Comment