Breaking News

09/04/2019

నానికి అంత ఈజీగా లేదంట

గుడివాడ, ఏప్రిల్ 9, (way2newstv.in)
రాష్ట్రంలో టీడీపీ-వైసీపీలు హోరాహోరీగా తలపడుతున్న స్థానాల్లో గుడివాడ నియోజకవర్గం ఒకటి…ఆవిర్భావం నుంచి టీడీపీకి కంచుకోటగా ఉన్న గుడివాడని 2014లో వైసీపీ గెలుచుకుంది. దానికి కారణం కొడాలి వెంకటేశ్వరరావు(నాని) అనే విషయం అందరికీ తెలుసు. కేవలం తన వ్యక్తిగత ఇమేజ్‌తోనే పార్టీ గెలిచేలా చేశారు. అయితే నానికి ఆ ఇమేజ్ రావడానికి టీడీపీనే కారణం. మొదట టీడీపీలో ఉండే నాని మాస్ లీడర్‌గా ఎదిగాడు. 2004, 2009 ఎన్నికల్లో విజయం సాధించాడు. అయితే ఆతర్వాత పార్టీని వీడి జగన్ చెంతకి చేరిన విషయం తెలిసిందే. నాని మరోసారి వైసీపీ తరుపున బరిలోకి దిగుతున్నారు. ఇక నానికి ఎలా అయిన చెక్ పెట్టాలనే ఉద్దేశంతో చంద్రబాబు వ్యూహాత్మకంగా తెలుగు యువత అధ్యక్షుడు దేవినేని అవినాశ్‌ని పోటీకి దించారు. అటు జనసేన అభ్యర్ధుల నామినేషన్స్ రిజెక్ట్ అవడంతో…ఆ పార్టీ అభ్యర్ధులు బరిలో లేరు. అయితే ఎవరు బరిలో ఉన్నప్పటికీ అసలు పోటీ టీడీపీ-వైసీపీల మధ్యే ఉంటుంది. ఇప్పటికే ప్రచారంలో దూసుకెళుతున్న ఇరువురు నేతలు…ప్రజలని ఆకర్షించడంతో పాటు…పదునైన రాజకీయ వ్యూహాలతో ముందుకువెళుతున్నారు.ఇక వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ కొట్టిన నాని…గుడివాడలో కొంతవరకు అభివృద్ధి మాత్రమే చేయగలిగారు. 


నానికి అంత ఈజీగా లేదంట

ఎందుకంటే నాని టీడీపీలో గెలిచిన రెండు సార్లు…టీడీపీ అధికారంలో లేదు. అలాగే వైసీపీలోకి వచ్చి గెలిచినప్పుడు కూడా…వైసీపీ అధికారంలో లేదు. అయితే నానికి గుడివాడలో మంచి ఫాలోయింగ్ ఉంది. ఏ కులం అయినా..ఏ మతం అయినా…నానికి అందరితో కలిసిపోయే గుణం ఉంది…అదే ఇప్పుడు ప్రజల్లో నాని మీద అభిమానం పెరిగేలా చేసింది. అలాగే జూనియర్ ఎన్టీఆర్ కుటుంబంతో ఉన్న సాన్నిహిత్యం కారణంగా…చాలామంది ఎన్టీఆర్ అభిమానులు నానికి మద్ధతుగా ఉన్నారు. ఇక గుడివాడలో ఎప్పటి నుంచో టీడీపీకి మద్ధతుగా ఉన్న కొన్ని గ్రామాలని తన వైపు తిప్పుకోవడం ప్లస్ అయ్యేలా కనిపిస్తోంది. కానీ దురుసుగా మాట్లాడటం…మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైనా నియోజకవర్గానికి పెద్దగా చేసిందేమిలేదని భావన న్యూట్రల్ ఓటర్లలో ఉండటం మైనస్ అవుతుంది. నానికి ఎలా అయిన చెక్ పెట్టాలనే ఉద్దేశంతో దేవినేని అవినాష్ నియోజకవర్గంలో ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. సీనియర్ నేతలనీ కలుపుకుని వ్యూహాత్మకంగా ముందుకు వెళుతున్నారు. ఇక్కడ టీడీపీకి బలమైన కేడర్ ఉంది. ఇక టీడీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాల పట్ల ప్రజల్లో సానుకూలత ఉంది. ఇదే అతి పెద్ద ప్లస్ పాయింట్. కేవలం ప్రచారానికే పరిమితం కాకుండా….రాజకీయ వ్యూహాల్లో కూడా ముందున్నారు. నానికి అండగా ఉంటున్న కొందరు బలమైన నేతలనీ తన వైపు తిప్పుకున్నారు. అలాగే నానికి పట్టున్న కొన్ని గ్రామాలు అవినాష్ వైపు వచ్చేశాయంటున్నారు. ఆర్ధికంగా కూడా అవినాష్ బలంగానే ఉన్నాడు. అయితే ఎంత గుడివాడలో ఇల్లు తీసుకున్న నాన్ లోకల్ అనే ఫీలింగ్ మాత్రం ఉంది. అలాగే మాస్ ఫాలోయింగ్ ఉన్న నానికి చెక్ పెట్టడం అంత సులువైన పని కాదనే చెప్పాలి.ఈ నియోజకవర్గంలో గుడ్లవల్లేరు, నందివాడ, గుడివాడ అర్బన్, రూరల్ మండలాలు ఉన్నాయి. గుడ్లవల్లేరులో టీడీపీకే ఆధిక్యం ఉంటుంది. ఇక గుడివాడ రూరల్‌పై నానికి పట్టుంది. అర్బన్, నందివాడ మండలాల్లో ఇరు పార్టీలు హోరాహోరీగా ఉన్నాయి. నియోజకవర్గంలో ఎస్సీ ఓటర్లు ఎక్కువగా ఉంటారు. తర్వాత బీసీలు, కాపులు ఉంటారు. కమ్మ ఓటర్లు కూడా ఎక్కువగానే ఉన్నారు. అయితే ఎస్సీలు, బీపీలు, కాపులు అభ్యర్ధుల గెలుపు ఓటములను ప్రభావితం చేస్తుంటారు. మొత్తం మీద చూసుకుంటే ఈ సారి నాని గెలుపు అంత సులువు కాదు. నానితో అవినాష్ ఢీ అంటే ఢీ అంటున్నారు. ఇద్దరి మధ్య హోరాహోరీ పోరు జరిగే అవకాశం ఉంది. ఎన్నికల్లో చోటు చేసుకునే పరిణామాలు బట్టి ఫలితం వచ్చే అవకాశం ఉంది.

No comments:

Post a Comment