Breaking News

09/03/2019

ఆ ఐదు గ్రామాలు సస్యశ్యామలమే...

ఐదు గ్రామాల చెరువులు నింపేందుకు మొదటి విడుతలో రూ.80 లక్షలు.. 
-రెండో విడతలో 2.80కోట్లు మంజూరు 
కరీంనగర్ రూరల్, మార్చి 9 (way2newstv.in)
కొత్తపల్లి మండలంలోని ఐదుగ్రామాలు ఇక సస్యశ్యామలం కానున్నాయి. ఆయా చెరువులను నింపేందుకు రంగం సిద్ధమైంది. కాలువ పనులు చివరిదశకు చేరుకోగా, ప్రజల దశాబ్ది కల నెరవేరింది. దీంతో ఆనందంలో మునిగితేలుతున్న అన్నదాతలు ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ కు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.లక్షలాది కుటుంబాల కన్నీటిని తుడిచిన వరద కాలువ కొత్తపల్లి మండలంలోని ఐదు గ్రామల అన్నదాతలకు మాత్రం కష్టాలను తెచ్చిపెట్టింది. వరద కాలువ నిర్మాణం కంటే ముందు ఎగువ ప్రాంతం నుంచి చెరువులు, కుంటల్లోకి వచ్చే నీరు రాకుండా పోవడంతో వందల ఎకరాలు బీళ్లుగా మారాయి. వరద కాలువ నిర్మాణ సమయంలో స్లూయిజ్‌ను నిర్మించినప్పటికీ సాంకేతికలోపం కారణంగా ప్రయోజనం లేకుండా పోయింది.సంబంధిత గ్రామాల రైతుల నుంచి వచ్చిన విజ్ఞప్తులతో పరిస్థితిని గమనించిన ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అప్పటి మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు దృష్టికి తీసుకెళ్లారు. ఈమేరకు వారు స్పందించారు. 


ఆ ఐదు గ్రామాలు సస్యశ్యామలమే...

అధికారులతో సర్వే చేయించి, ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపగా కాలువ నిర్మాణం కోసం రూ.2.80 కోట్లు, భూ సేకరణ కోసం రూ.80 లక్షలు మంజూరయ్యాయి.కరీంనగర్ నియోజకవర్గంలోని కొత్తపల్లి మండలంలో గల ఐదు గ్రామాలకు సాగు, తాగునీరందించేందుకు కసరత్తు చేపట్టారు. కరీంనగర్, కొత్తపల్లి మండలాల్లోని 30 గ్రామాల్లో 25 గ్రామాలకు పూర్తిస్థాయిలో సాగునీరు అందుతుండగా, మండలంలోని ఆసిఫ్‌నగర్, బద్దిపల్లి, నాగులమాల్యాల, కమాన్‌పూర్, ఎలగందుల గ్రామాల్లో పంట భూములకు నీరు అందని పరిస్థితి నెలకొంది.గతంలో గంగాధర మండలం గర్షకుర్తి ప్రాంతం నుంచి భారీగా వచ్చే వరద ఆచంపల్లి చెరువు మీదుగా నాగుల మల్యాల, ఆసిఫ్‌నగర్, బద్దిపల్లి, కమాన్‌పూర్, ఎలగందుల గ్రామాల్లోని సుమారు 10 పెద్ద, చిన్న చెరువులు, కుంటల్లోకి చేరేది. దీంతో సాగునీటికి ఇబ్బందులు లేకుండా పోయింది. అయితే ఆచంపల్లి వద్ద వరద కాలువ నిర్మించడంతో వరదనీరు ఆచంపల్లిలోని కాట్రేనికుంటలోకి రాకుండా పోయింది. దీంతో కింద ఉన్న గొలుసుకట్టు చెరువుల్లో నీరు లేకపోవడంతో ఆరు గ్రామాల ప్రజలకు సాగునీటి కోసం ఇబ్బందులు ఎదురయ్యాయి. 2011లో వరద కాలువ నుంచి ఆచంపల్లి చెరువు నింపేందుకు స్లూయిజ్‌ను నిర్మించినప్పటికీ సాంకేతికలోపం కారణాలతో అది ఆచరణకు నోచుకోకుండాపోయింది. దీంతో అప్పటి నుంచి ఈ గ్రామాల్లో రైతులు సాగునీటి కోసం పూర్తిగా బోర్లపైనే ఆధారపడాల్సి రాగా, వర్షాభావ పరిస్థితుల్లో సుమారు 1600 ఎకరాలు బీళ్లుగా మారే పరిస్థితి వచ్చింది. ఈ సమస్య పరిష్కారానికి అవసరమైన ప్రతిపాదనలు తీసుకొని వస్తే తక్షణమే అనుమతులు ఇస్తానని అప్పటి మంత్రి హరీశ్‌రావు హామీ ఇవ్వడంతో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆ దిశగా శరవేగంగా అధికారులతో సర్వే చేయించి ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపారు. రూ.2.80 కోట్లు విడుదలయ్యాయి. మొదటి విడతలో ఆచంపల్లి వరద కాలువ నుంచి నాగుల మల్యాల చెరువులోకి నీరు చేరేందుకుగానూ రూ.80 లక్షలు మంజూరు చేశారు. నిరుపయోగంగా స్లూయిజ్ 2011 సంవత్సరంలో వరద కాలువ నుంచి ఆచంపల్లి కాట్రేనికుంట నింపేందుకు సుమారు 20 గజాల లోతులో నిర్మించిన వరద కాలువ వలన దిగువన ఉన్న పంటలు ఎండిపోయే పరిస్థితి వచ్చిందనీ, రూ. 24 లక్షలతో వరద కాలువ పై భాగం నుంచి 6 మీటర్ల లోతులో ప్రత్యేక తూం నిర్మించి నీటి ప్రవాహాన్ని ఆచంపల్లి కుంట నుంచి నాగులమల్యాల చెరువులోకి మళ్లించే ప్రయత్నం చేశారు. అయితే స్లూయిజ్ నిర్మాణంలో సాంకేతిక లోపంతో ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో తాగునీటి బావులు, బోర్లలో భూగర్భజల మట్టం భారీ స్థాయిలో పడిపోయింది. వంద క్యూసెక్కుల సామర్థ్యంతో కాలువ తవ్వకం బీళ్లుగా మారుతున్న ఆయకట్టును తిరిగి సస్యశ్యామలం చేసే దిశగా అధికారులతో ఎమ్మెల్యే ప్రత్యేక ప్రణాళికలు రూపొందించి, నిధుల మంజూరుకు కృషి చేశారు. ఇందులో సాగునీటి పారుదల, ఎత్తిపోతల విభాగం అధికారులతో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ సంయుక్తంగా కలిసి ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పనులను పర్యవేక్షించారు. గతంలో మధ్యమానేరు కాలువ నుంచి ఎత్తిపోతల ద్వారా నీటిని మళ్లించాలని నిర్ణయించినా సాంకేతికంగా ఇబ్బందులు తలెత్తే పరిస్థితి ఉండడంతో ప్రత్యామ్నాయ ప్రణాళిక సిద్ధం చేశారు. నేరుగా వరద కాలువ నుంచే గ్రావిటీ ద్వారా వంద క్యూసెక్కుల సామర్థ్యంతో కాలువను తవ్వి, నాగుల మల్యాల చెరువులోకి అక్కడి నుంచి దిగువన ఉన్న ఐదు గ్రామాల్లోని గొలుసుకట్టు చెరువులను నింపేందుకు పూర్తి అంచనాలతో ప్రభుత్వానికి సమగ్ర ప్రతిపాదనలు సమర్పించారు. కాలువ నిర్మాణానికి దీనికి ప్రభుత్వం రూ.2.80కోట్ల నిధులతోపాటు భూములు కోల్పోతున్న వారికి నష్టపరిహారం అందజేసింది. ఏప్రిల్ చివరినాటికి నీరు ఏప్రిల్ చివరి నాటికి కాలువ పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్లు, అధికారులకు సూచించారు.వరద కాలువ నీటిని ఐదు గ్రామాల చెరువులకు అందేలా చూస్తామన్నారు. అప్పటి అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఐదు గ్రామాల్లో పంట చేలు బీడు భూములుగా మారాయని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అప్పటి మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు సహకారంతో రూ. మూడు కోట్లతో కాలువను నిర్మిస్తున్నామని తెలిపారు. గ్రామాల్లో సాగునీటికి ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పారు

No comments:

Post a Comment