Breaking News

09/03/2019

సిట్టింగ్ అభ్యర్థులకే టీడీపీ పెద్ద పీట

విశాఖపట్టణం, మార్చి 9, (way2newstv.in)
విశాఖ జిల్లాల్లో సిట్టింగ్‌లకే చంద్రబాబు ప్రాధాన్యత ఇచ్చారు. విశాఖ తూర్పు వెలగపూడి రామకృష్ణ, దక్షిణం వాసుపల్లి గణేష్‌కుమార్‌, పశ్చిమం గణబాబు, గాజువాక పల్లా శ్రీనివాసరావు, ఎస్‌.కోట లలితకుమారిలకు కేటాయించినట్లు తెలిసింది. భీమిలి, ఉత్తర నియోజకవర్గాలను పెండింగ్‌లో ఉంచారు.ఇటీవల ముత్తంశెట్టి శ్రీనివాసరావు వైసిపిలో చేరికతో రాజకీయ ముఖ చిత్రంలో పలు మార్పులు చోటుచేసుకున్నాయి. ఎమ్మెల్యేల టికెట్ల కేటాయింపుపైనా, ఎంపీ సీటు ఇచ్చేందుకైనా సామాజిక తరగతుల మధ్య సమతుల్యత సాధించడం అనేది ఏ పార్టీకైనా పెద్ద సమస్యే. ప్రస్తుతం ముత్తంశెట్టి పార్టీని వీడడంతో టిడిపికి మరింత కత్తిమీద సాముగా మారింది. ముత్తంశెట్టి మారకుండా ఉండి ఉంటే విశాఖ ఎంపీ సీటు బాలకృష్ణ అల్లుడు శ్రీభరత్‌కు కేటాయించి ఉండేవారు. భీమిలి టిక్కెట్టు గంటా శ్రీనివాసరావుకు దక్కేది. ఉత్తరాంధ్రలోని ఐదు పార్లమెంట్‌ స్థానాలకుగానూ శ్రీకాకుళం బిసి, విజయనగరం ఒసి, అరకు ఎస్‌టికి గ్యారెంటీ కాగా, వీటిల్లో ఒకటి కాపునకు కచ్చితంగా వదిలేయాల్సిందే. 


సిట్టింగ్  అభ్యర్థులకే టీడీపీ పెద్ద పీట

అది అనకాపల్లి అవుతుందా? లేదంటే విశాఖ కానుందా? అన్నది సందేహంగా మారింది. ఒకవేళ గంటాను విశాఖ ఎంపీ సీటుకు పంపించి ఉత్తరం అసెంబ్లీ సెగ్మెంట్‌లో భరత్‌కు సీటిచ్చినా ఉత్తరం, తూర్పు రెండూ ఒకటే సామాజిక తరగతి అయిపోతాయి. ఇదీ పెద్ద సమస్యే కానుంది.అనకాపల్లి లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపికపై టిడిపి అధిష్టానం మల్లగుల్లాలుపడుతోంది. మాడుగుల, పాయకరావుపేట అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి సిట్టింగ్‌ ఎమ్మెల్యే వంగలపూడి అనిత, మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు అభ్యర్థిత్వాల ఎంపిక ఒక కొలిక్కిరాకపోవడంతో వాయిదా వేసినట్లు తెలిసింది. ఈ రెండు నియోజకవర్గాల్లో అధికార పార్టీలో గ్రూపులు తీవ్రంగా ఉండడంతో చంద్రబాబు ఓ నిర్ణయం తీసుకోలేకపోయారు. అనకాపల్లి ఎంపీగా పోటీ చేసేందుకు మంత్రి అయ్యన్నపాత్రుడు తన కుమారుడు విజరు పేరు ప్రతిపాదించినట్లు తెలిసింది. విశాఖ డెయిరీ ఛైర్మన్‌ ఆడారి తులసీరావు కుమారుడు ఆనంద్‌ కూడా అనకాపల్లి నుంచి పోటీ చేసేందుకు సుముఖత వ్యక్తం చేయగా, ఈ రెండు ప్రతిపాదనలను చంద్రబాబు తిరస్కరించినట్లు తెలిసింది. కొద్ది రోజుల్లో పార్టీలో చేరనున్న మాజీ మంత్రి కొణతాల రామకృష్ణను అనకాపల్లి నుంచి పోటీచేయించనున్నట్లు చంద్రబాబు తెలిపినట్లు సమాచారం. ప్రస్తుత పరిస్థితుల్లో బలమైన అభ్యర్థులను పోటీ నిలపకపోతే జరగబోయే నష్టం పార్టీ నాయకులకు బాబు వివరించి సముదాయించినట్లు తెలిసింది. మాడుగుల, పాయకరావుపేట మినహా మిగిలిన అసెంబ్లీ నియోజకవర్గాలు, అనకాపల్లి లోక్‌సభకు పోటీచేసే అభ్యర్థుల వరకు సూచనప్రాయంగా చంద్రబాబు ఏకాభిప్రాయానికి వచ్చినట్లు తెలిసింది.

No comments:

Post a Comment