Breaking News

08/03/2019

మహిళలు అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా రాణించాలి

రాష్ట్ర ఆర్థిక కమీషన్, చైర్మన్ రాజేశం గౌడ్
హైదరాబాద్ మార్చ్ 8 (way2newstv.in)
మహిళలు అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా రాణించవలసిన ఆవశ్యకత వున్నదని తెలంగాణ రాష్ట్ర ఆర్థిక కమీషన్ జి.రాజేశం గౌడ్ అన్నారు. యత్ర నార్యస్తు పూజ్యంతే.. రమంతే తత్ర దేవతా.. ఎక్కడ స్త్రీలు గౌరవింపబడుతారో.. అక్కడ దేవతలు కొలువై ఉంటారంటారు. స్త్రీలను గౌరవించుకోవడం మరియు సత్కరించుకోవడం మన సంప్రాదాయం మన కనీస  బాధ్యత అని అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రతి సంవత్సరం మార్చి 8 న ఆచరించడం వలన ప్రతిభావంతు లైన  మహిళల సేవలను గుర్తించి ఈ రోజు ప్రపంచానికి  పరిచయం చేయడం చాల సంతోషదాయకం అని తెలుపుతూ తొలిసారిగా 1911లో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జురుపుకొన్న మహిళలు  ఈ ఏడాది 108వ అంతర్జాతీయ మహిళా దినోత్సవం ను జరుపుకొను చున్న శుభ సందర్బంలో మహిళలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు.


మహిళలు అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా రాణించాలి


మహిళలను గౌరవించుకోవడం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భం గా   70 ఏండ్ల స్వతంత్ర భారతంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ  రాష్ట్ర ముఖ్య మంత్రి కె.చంద్ర శేఖర్ రావు  ప్రభుత్వం మహిళలకు ప్రతి ఏటా ప్రత్యేక పురస్కారాలను మహిళా దినోత్సవం సందర్భంగా అందజేయడం జరుగుచున్నదన్నారు.2019 పురస్కారంలో భాగంగా వివిధ రంగాల్లో సత్తా చాటుతున్న తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రతిభామూర్తుల్లో 14 కేటగిరీలకుగాను 21 మందిని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ మహిళలుగా ఎంపిక చేసి వీరికి అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున హైదరాబాద్ లోని రవీంద్రభారతిలో నగదు పురస్కారంతో సత్కరించడం ఎంతో అభినందనీయమన్నారు.అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణలో పనిచేస్తున్న అన్ని ప్రభుత్వ శాఖల ప్రభుత్వ ఉద్యోగినులకు తెలంగాణ ప్రభుత్వం కానుకగా  ఇవాళ వారందరికి స్పెషల్ క్యాజువల్ లీవ్‌ను మంజూరి చేయడం, తెలంగాణ ప్రభుత్వమునకు మహిళల పట్ల గల చిత్తశుద్ది ని తెలియజేస్తున్నదన్నారు.

No comments:

Post a Comment