కర్నూలు, మార్చ్,14(way2newstv.in)
కర్నూలు జిల్లా ఇండియస్ మెడికల్ అసోసియేషన్ ప్రతినిధులు మాజీ సైనికుల, వారి కుటుంబాల సహయార్ధం రూ. 2,44,000 విరాళాన్ని జిల్లా కలెక్టర్ సత్యనారాయణ కు అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పుల్వామాలో సైనికులు తమ ప్రాణాలను పోగొట్టుకున్నారని తెలిపారు.
సైనిక సంక్షేమానికి ఐఎంఏ విరాళం
మాజీ సైనికుల కుటుంబాలకు సహాయార్ధంము తమ వంతు విరాళాన్ని ఇస్తున్నామన్నారు. విరాళాన్ని ఇచ్చి నందుకుగాను జిల్లా కలెక్టర్ వారిని అభినందించినారు. ఈ కార్యక్రమంలో జిల్లా సైనిక సంక్షేమాధికారి జి.రాచయ్య, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డా.బి రమేష్, డా. ఎస్.వి.రామ మో హన్ రెడ్డి, ట్రెజరర్ డా.కె.రామ చంద్ర నాయుడు, డా.ముంతాజ్ అజీజ్, డా.త్రీనాధ్ ఇతరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment