సిద్దిపేట పోలీస్ కమిషనర్ డి. జోయెల్ డేవీస్
సిద్దిపేట, మార్చి 14 (way2newstv.in)
సిద్దిపేట జిల్లాలో పదవ తరగతి పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉందని సిద్దిపేట పోలీస్ కమిషనర్ డి. జోయెల్ డేవీస్ అన్నారు. ఈనెల 16 నుండి ప్రారంభంయగు పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు సిద్దిపేట జిల్లాలో వున్న 77 కేంద్రాల వద్ద సి.ఆర్.పి.సి 144 సెక్షన్ విధించినట్లు తెలిపారు. 16 నుండి 02 వ తేదీవరకు ఉదయం ఆరు గంటలనుంచి సాయంత్రం ఆరు గంటల వరకు అమల్లో ఉంటుందన్నారు. పరీక్షలు జరుగు సమయంలో అన్ని జిరాక్స్ సెంటర్స్ మూసి వేయాలని, పరీక్ష సెంటర్స్ వద్ద నుండి 200 మీటర్ల వరకు ప్రజలు గుమిగూడ వద్దని, పరీక్షలకు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు ఏర్పాటు చేశాము.
పదవ తరగతి పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
జిల్లాలో పోలీసు అధికారులు మరియు సిబ్బంది అందరూ అప్రమత్తంగా ఉంటారని తెలిపారు. పోలీస్ అధికారులు పరిక్ష సమయంలో పెట్రోలింగ్ చేయలని మరియు పోలీస్ స్టేషన్లో నుండి పరిక్ష పత్రం పరిక్ష కేంద్రానికి వెళ్ళే సమయంలో కానిస్టేబుల్ తప్పనిసరిగా ఎస్కార్ట్ వుండాలని, పరిక్ష కేంద్రాల వద్ద పట్టిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. విద్యార్థులనుద్దేశించి మాట్లాడుతూ పరీక్షా సమయానికే అరగంట ముందే కేంద్రానికి చేరుకోవాలని, మానసికంగా ఎటువంటి ఆందోళన చెందకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని కమిషనర్ సూచించారు.
No comments:
Post a Comment