Breaking News

14/03/2019

టిఆర్ఎస్ 16 స్థానాలు కాదు 6 స్థానాలు గెలుస్తే ఎక్కువ

కేంద్రంలో టీఆర్‌ఎస్‌ సహకారం లేకుండానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం
బిజేపి ఎంపి బండారు దత్తాత్రేయ 
హైదరాబాద్‌ మార్చ్ 14 (way2newstv.in)   
కేంద్రంలో బీజేపీ టీఆర్‌ఎస్‌ సహకారం లేకుండానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని మాజీ కేంద్ర మంత్రి, బిజేపి ఎంపి బండారు దత్తాత్రేయ ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణరాష్ట్రము నుండి 17 పార్లమెంట్‌ స్థానాల నుంచి బీజేపీ పోటీ చేస్తుందని తెలిపారు.రాష్టం లో టిఆర్ఎస్ పార్టీ 16 స్థానాలు గెలుస్తామని డప్పు కొట్టుకుంటుందని కానీ 6 స్థానాలు గెలువడం మహా ఎక్కువన్నారు.వచ్చే ఎన్నికల్లో ఎన్డీయే కూటమి బలం పెరగడమే కాకుండా బీజేపీ సొంతంగా 300 లోక్‌సభ స్థానాల్లో విజయం సాధిస్తుందని జోస్య చెప్పారు. 


టిఆర్ఎస్ 16 స్థానాలు కాదు 6 స్థానాలు గెలుస్తే ఎక్కువ

దేశంలోని ప్రతిపక్ష పార్టీలు మహాకూటమి అనే ఏర్పాటును పక్కన పెట్టి తమ అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయని ఎద్దేవా చేశారు. తన పార్టీ గెలుపుపై నమ్మకం కోల్పోయిన చంద్రబాబు కలవరపాటుకు గురై దేశ రాజకీయాలను పక్కకు పెట్టి వచ్చారన్నారు. సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గం నుంచి తాను తిరిగి పోటిలో ఉన్నానని అదిష్టానం ఆదేశిస్తేనే పోటీచేస్తానని, ఒకవేళ తనను కాదని వేరే వారి పేరును ప్రకటించిన కూడా అభ్యంతరం లేదని చెప్పారు.నేడు ఆయన  మీడియాతో మాట్లాడుతూ... అభ్యర్థుల ఎంపిక విషయంలో రాష్ట్రంలో అన్ని పార్టీల కంటే తమ పార్టీయే ముందంజలో ఉందన్నారు. దేశంలో అన్ని సమస్యల పరిష్కారం నరేంద్ర మోదీ ఒక్కడి వల్లనే సాధ్యమవుతందన్న విశ్వాసం ప్రజల్లో రోజురోజుకు బలపడుతుందన్నారు. త్వరలో తెలంగాణకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షాతో పాటు కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ వచ్చి ప్రచారం చేస్తారని చెప్పారు. 

No comments:

Post a Comment