నల్లగొండ, మార్చి 5, (way2newstv.in)
విద్యా విధానాన్ని పకడ్బందీగా నిర్వహించేందుకు చర్యలు చేపట్టింది. అడ్మిషన్ల కోసం ఊరూరు తిరుతున్న దళారులను గుర్తిస్తోంది. ప్రైవేటు యాజమాన్యాలు ఆన్‌లైన్ విధానాన్ని వ్యతిరేకించినప్పటికీ ప్రభుత్వం మాత్రం ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో విద్యా ప్రమాణాలు పెరుగుతున్నాయి. ఫీజు రియాంబర్స్‌మెంట్, నకిలీ అడ్మిషన్లు లేకుండా పటిష్టంగా డిగ్రీ కళాశాలల్లో దోస్త్ విధానం అమలవుతోంది. జిల్లాలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలతో పాటు ప్రైవేటు డిగ్రీ కళాశాలల్లోనూ రిజర్వేషన్ పద్ధతిలో ప్రవేశాలు కల్పిస్తున్నారుడిగ్రీ కళాశాలలో అడ్మిషన్ పొందితే మూడేండ్లు కళాశాల యాజమాన్యం వారి నుండి వేలాది రూపాయలు ముక్కు పిండి వసూలు చేసేది. దీంతో విద్యార్థులు భారీగా నష్టపోయేవారు. ఉపకార వేతనాలు ఎంత వస్తుంది చెప్పకుండా వచ్చినకాడికి దండుకునే వారు. దీంతో ప్రభుత్వం అధికార యంత్రాంగం విద్యావిధానాలలో మార్పు తెచ్చేందుకు కసరత్తు ప్రారంభించింది. గత ఏడాది ముందు నుండి ‘దోస్త్’కార్యక్రమం ద్వారా అడ్మిషన్లు కేటాయిస్తోంది.
ఆన్ లైన్ అడ్మిషన్లతో దళారీలకు చెక్
ఆన్‌లైన్‌లో చేపడుతున్న సీట్ల కేటాయింపుతో కళాశాలల యాజమాన్యాలకు ముప్పు తప్పడం లేదు. ప్రైవేటు యాజమాన్యాలు సీట్లు నిండక ఇబ్బందులకు గురైనప్పటికీ విద్యార్ధి ఇష్టమైన కళాశాలలో సీటు పొందుతున్నారు. జిల్లాలో 2018 19 విద్యా సంవత్సరంలో వేలాది సీట్లు ఖాళీగా ఉండడంతో యాజమాన్యాలు మూత వేసుకునే దిశకు చేరుకున్నాయి. రెండు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు, 25 ప్రైవేటు డిగ్రీ కళాశాలల్లో 25 శాతం సీట్లు మాత్రమే నిండడంతో వాటి భవితవ్యం ప్రశ్నార్ధకంగా మారుతుంది. అయినప్పటికీ ఉత్తమ విద్యనందించే కళాశాలలకు మౌళిక వసతులు ఉన్న కళాశాలల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని కళాశాలలు మహాత్మా గాంధీ యూనివర్సిటీ పరిధిలో నడుస్తున్నాయి. అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సులో విద్యా విధానం పటిష్టం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. 2016 17 విద్యా సంవత్సరంలోని దోస్త్ పథకాన్ని అమలు చేపట్టింది.ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని సూర్యాపేట, నల్లగొండ, యాదాద్రితో పాటు దేవరకొండ, కోదాడ, రామన్నపేటతో పాటు వివిధ పట్టణాలలో 10 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు, సూర్యాపేట, మిర్యాలగూడలో ఎయిడెడ్ కళాశాలలు ఉన్నాయి. 90 ప్రైవేటు డిగ్రీ కళాశాలలు ఉండగా ఆయా కళాశాలల్లో సుమారు 36 వేల పై చిలుకు విద్యార్థులకు అడ్మిషన్లు ఇచ్చే అవకాశముంది. కానీ విద్యార్థులకు అవసరమైన గ్రూపులు దొరకక ఎక్కువ మంది హైదరాబాద్, ఖమ్మం జిల్లాలకు కూడా విద్యార్థులు వలస పోతున్నారు. యాదాద్రి భువనగిరి, నల్లగొండ ప్రాంతాల నుండి రంగారెడ్డి జిల్లాలోని ప్రైవేటు కళాశాలల్లో అధిక మంది విద్యార్థులు ఉమ్మడి నల్లగొండ జిల్లా నుండి వెళ్లిన వారే ఉన్నారు.2018 19 సంవత్సరంలో 26 వేల మంది విద్యార్థులు డిగ్రీల్లో ప్రవేశం పొందారు. సుమారు 10 వేల పై చిలుకు సీట్లు ఖాళీగా ఉన్నాయి. ప్రభుత్వ కళాశాలలతో మౌలిక వసతులు లేని కళాశాలల్లోనూ సీట్లు మిగిలిపోయాయి. అందులో భాగంగానే ప్రభుత్వం ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసి మహాత్మా గాంధీ యూనివర్సిటీతో పాటు రాష్ట్రంలోని వివిధ యూనివర్సిటీలతో డిగ్రీ కళాశాలల అడ్మిషన్లపై చర్యలు తీసుకునే విధంగా ప్రణాళికలు రూపొందించినట్లు తెలుస్తోంది. విద్యార్థులకు అనుగుణంగా మౌళిక వసతులు, అధ్యాపకులు, లేబరేటరీ సౌకర్యం, లైబ్రరీ వంటి కనీస వసతులు కూడా లేని కళాశాలలను మూసివేసే దిశగా అడుగులు పడుతున్నట్లు సమాచారం.దోస్త్ విధానం పేద విద్యార్థులకు వరంగా మారుతుంది. పేరున్న కళాశాలలో సీటు పొందడం పేదలకు కష్టతరంగా మారేది. ఇష్టానుసారంగా అడ్మిషన్లు పొందడంతో యాజమాన్యాలు పేద విద్యార్థులకు ఫీజులు చెల్లించలేని వారికి సీట్లు దక్కేవి కావు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ద్వారా ప్రతి కళాశాలలో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతోంది. ఆన్‌లైన్‌లో రిజర్వేషన్ ప్రకారం సీట్లు నింపడంతో ప్రతి గ్రూపులో ఇష్టమైన విద్యార్థులు చేరుతున్నారు. ప్రైవేటు కళాశాలల్లో ఒక్కో గ్రూపులో 40 సీట్లు ఉంటున్నాయి. వాటిలో ఆన్‌లైన్ ద్వారా సీట్ల కేటాయింపు ప్రకారం బిసిఎ 2, బిసిబి 2, బిసిడి 4, మైనారిటీ (బిసిఈ)2, ఓసీలకు ఆరు సీట్లు, ఎన్‌సీసీ 1, ఆర్మీలో పనిచేసిన వారి పిల్లలకు 1 చొప్పున 40 సీట్లను నింపాల్సి ఉంది. మార్కులు ఎక్కువ వచ్చిన వారికి మాత్రమే సీట్లు వచ్చే అవకాశం ఉంది. దరఖాస్తు చేసిన విద్యార్థులకు మాత్రమే సీటు వచ్చే అవకాశముంది. ఎంత మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నా 40 సీట్లకు మించి ఇచ్చే అవకాశం లేదు. ఆన్‌లైన్ విధానంలో ఒక కళాశాలలో సీటు వచ్చిన విద్యార్థి రెండవ సారి మరో కళాశాలకు వెళ్లే అవకాశం కూడా కల్పించారు. ఒక కళాశాలలో ఏదేని రిజర్వేషన్ ద్వారా సీటు పొందిన విద్యార్ధి మరో కళాశాలకు వెళ్లినప్పుడు ఇంకో అదే కేటగిరి విద్యార్ధికి అవకాశం ఉంటుంది.
No comments:
Post a Comment