Breaking News

05/03/2019

మరింత పెరిగిన పెట్రోల్ ధరలు

ముంబై, మార్చి 5 (way2newstv.in)
దేశీ ఇంధన ధరలు పెరుగుతూనే ఉన్నాయి. వరుసగా ఆరో రోజు కూడా పెట్రోల్, డీజిల్ ధరలు పైకి కదిలాయి. మంగళవారం (మార్చి 5) పెట్రోల్ ధర 7 పైసలు, డీజిల్ ధర 10 పైసలు పెరిగింది. ఇకపోతే అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు స్వల్పంగా తగ్గాయి.దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.72.24 వద్ద.. డీజిల్ ధర రూ.67.64 వద్ద కొనసాగుతున్నాయి. వాణిజ్య రాజధాని ముంబయిలో పెట్రోల్ ధర రూ.77.87 వద్ద ఉండగా.. డీజిల్ ధర రూ.70.86 వద్ద ఉంది. 


మరింత పెరిగిన పెట్రోల్  ధరలు

ఇక హైద‌రాబాద్‌లో పెట్రోల్ ధర 76 మార్క్‌ పైనే కదలాడుతోంది. రూ.76.66 వద్ద ఉంది. డీజిల్ ధర రూ.73.55 వద్ద కొనసాగుతోంది. అమరావతిలో పెట్రోల్‌ ధర రూ.76.40 వద్ద, డీజిల్‌ ధర రూ.72.86 వద్ద ఉంది. ఇక విజయవాడలో పెట్రోల్ ధర రూ.76.03 వద్ద, డీజిల్ ధర రూ.72.52 వద్ద కొనసాగుతోంది. 
అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు స్వల్పంగా తగ్గాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌‌కు 0.32 శాతం తగ్గుదలతో 65.46 డాలర్లకు క్షీణించింది. ఇక డబ్ల్యూటీఐ క్రూడాయిల్ ధర బ్యారెల్‌కు 0.44 శాతం క్షీణతతో 56.34 డాలర్లకు దిగొచ్చింది

No comments:

Post a Comment