Breaking News

11/03/2019

పార్టీలకు తలనొప్పిగా మారిన చేరికలు

విజయవాడ, మార్చి 11, (way2newstv.in)
పార్టీల్లో కొత్త ముఖాలు. ఇది అన్ని పార్టీల్లోనూ క‌నిపిస్తున్న విషయ‌మే. ఎక్క‌డికక్క‌డ కొత్త‌వారికి అవ‌కాశం ఇస్తూ.. పోయేందుకు నాయ‌కులు సైతం రెడీ అవుతుండ‌డం గ‌మనార్హం. ఎన్నిక‌ల‌కు స‌మ‌యం స‌మీపిస్తుండ‌డంతో పార్టీల్లో చేరేందుకు నాయ‌కులు క్యూక‌డుతున్నారు. టికెట్ల‌పై ఆశ పెట్టుకుని, అవి ఫ‌లిస్తాయో లేదోన‌నే ఆందోళ‌న‌తో ఉన్న నాయ‌కులు అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు జంప్ చేస్తున్నారు. దీంతో పార్టీల మ‌ధ్య నేత‌ల గోడ‌దూకుళ్లు అత్యంత ఆస‌క్తిగా మారా యి. అయితే, ఇలా ఎన్నాళ్లు? అనేది సాధార‌ణంగా వ‌చ్చే ప్ర‌శ్న‌. ఎన్నిక‌ల‌కు షెడ్యూల్ విడుద‌ల అయ్యే వ‌రకు ఇంతే అనే స‌మాధానం వ‌స్తోంది.ప్ర‌స్తుతం అధికార టీడీపీ, విప‌క్షం వైసీపీ ప‌రిస్థితిని చూస్తే.. ఒక‌దానిని మించి మ‌రొక పార్టీ కొత్త వారికి ఛాన్స్ ఇస్తున్నాయి. 



పార్టీలకు తలనొప్పిగా మారిన చేరికలు

అధికారంలోకి రావాల‌ని జ‌గ‌న్‌. ఉన్న అధికారాన్ని రెండోసారి కూడా నిల‌బెట్టుకోవాల‌ని చంద్ర‌బాబు ఇలా ఒక‌రికి ఒక‌రు ప్ర‌త్యేక టార్గెట్లు పెట్టుకుని ముందుకు సాగుతున్నారు. ఈ క్ర‌మంలోనే గెలుపు గుర్రాల‌కు మాత్ర‌మే అవ‌కాశం ఇవ్వాల‌ని నిర్ణ‌యించుకున్నారు. దీంతో ఇప్ప‌టికే ఉన్న సిట్టింగుల స్థానంలో కొంద‌రికి టికెట్ల‌ను ప‌క్క‌కు పెట్టి. ఆర్ధికంగా, సామాజికం గా మ‌రింత జోరుగా ఓట్లు రాబ‌ట్టేవాళ్ల‌ను పార్టీలు గేలం వేస్తున్నాయి. అయితే, ఇలా పార్టీలు మారుతున్న వారు విచిత్రంగా అయితే టీడీపీ లేదంటే.. వైసీపీ లోకే జంప్ చేస్తుండ‌డం గ‌మ‌నార్హం. విచిత్రం ఏంటంటే గ‌తంలో వైసీపీలో ఉండి తిరిగి టీడీపీలోకి వ‌చ్చిన ర‌ఘురామ‌కృష్ణం రాజు లాంటి వాళ్లు ఇప్పుడు తిరిగి వైసీపీలోకే వెళ్లిపోయారు.వాస్త‌వానికి మ‌రో ప్ర‌త్యామ్నాయంగా ఉన్న జ‌న‌సేన‌లోకి వెళ్తార‌ని, జ‌న‌సేనాని ప‌వ‌న్ నాయ‌క‌త్వానికి జై కొడ‌తార‌ని అంద‌రూ అనుకున్నారు. ఇటు టీడీపీ అసంతృప్తులు, అటు వైసీపీ అసంతృప్తులు కూడా జ‌న‌సేనలోని జంప్ చేస్తార‌ని భావించారు. అయితే, అనూహ్యంగా ఈ రెండు పార్టీల్లోనే జంపింగ్‌లు ఉన్నాయి త‌ప్పితే.. ప్ర‌త్యేకంగా జ‌న‌సేన‌లోకి ఎవ్వరూ వెళ్ల‌క పోవ డం గ‌మ‌నార్హం. పైగా ఆ దిక్కుగా ఆలోచించిన పార్టీలు కానీ, నాయ‌కులు కానీ లేక‌పోవ‌డం మ‌రింత ఆలోచింప‌జేసే అంశం. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప్ర‌త్యేకత చాటుతాన‌ని ప్ర‌క‌టించిన ప‌వ‌న్‌కు ఈ ప‌రిణామం మింగుడుకాని ప‌రిణామంగానే భావించాలి. లేదంటే.. ఆయ‌న‌కు ఎన్నిక‌ల్ స్ట్రాట‌జీ మ‌రొక‌టి ఉంద‌ని అనుకోవాల్సి ఉంటుంది… ఏదేమైనా..పార్టీల్లో కొత్త ముఖాలు క‌నిపిస్తున్నాయి. మ‌రి వీరు ఎలాంటి పాలిటిక్స్‌ను న‌డిపిస్తారో చూడాలి.

No comments:

Post a Comment