Breaking News

02/03/2019

మహాశివరాత్రికి ముస్తాబుతున్న పులిగట్టు ఆంజనేయ స్వామి ఆలయం

కౌతాళం, మార్చి 2 (way2newstv.in
మహాశివరాత్రి కి ముస్తాబవుతున్న  పులిగట్టు ఆంజనేయ స్వామి కి  అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామని ఆలయ అర్చకులు చిన్న స్వామి తెలిపారు.కౌతాళం మండల పరిధిలో ఏరిగేరి గ్రామంలో వెలసిన దైవం ఈ పులిగొట్టు ఆంజనేయ స్వామి, విశేషపూజలు అందుకుంటున్న దైవం కొలిచేరికి కొంగు బంగారం పిలిస్తే పలికే  దేవుడు,అని భక్తులకు గ్రామస్తులకు అపార నమ్మకం ఈ ఆంజనేయ స్వామి, శని వారం, అమావాస్య వారాలలో  ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ మహాశివరాత్రి  వేడుకలకు వెల సంఖ్యలో భక్తులు తరలివస్తారు.ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. సోమవారం నాడు స్వామి ఆలయంలో భక్తులు గ్రామస్తులు జాగరణ చేస్తారు.మంగళవారం నాడు స్వామివారి కి ప్రత్యేక అలంకరణ  పులమాలలతో  ప్రత్యేకంగా అలంకరిస్తారు. 


మహాశివరాత్రికి ముస్తాబుతున్న పులిగట్టు ఆంజనేయ స్వామి ఆలయం

విశేష పూజలు అభిషేకాలు నిర్వహిస్తాము.అధిక సంఖ్యలో  భక్తులు తలనీలాలు ఇస్తారు.భక్తులు టెంకాయలు,నైవేద్యాలు సమర్పిస్తారు. వారికి నీటి వసతులు కల్పిస్తాము. భక్తులకు తాగునీటి కోసం తగు చర్యలు తీసుకుంటామని పూజారి తెలిపారు.బుదవారం నాడు పులిగట్టు ఆంజనేయ స్వామిని పులమాలలతో అలంకరించి భక్తులు, గ్రామస్తులు పుర విధుల్లో ఊరేగింపుగా గ్రామంలోకి తీసుకొని వస్తారు.ఊరేగింపుగా వచ్చేటప్పుడు మేళా తలలతో, బ్యాండ్ బాజాలతో, బాణా సంచారంతో  టపకాసులతో అంగా రంగా వైభోవంగా స్వామి వారి పల్లకి పులిగట్టు ఆంజనేయ స్వామి భక్తులకు కనువిందుగా దర్శనమిస్తారు.భక్తులు  టెంకాయలు నైవేద్యాలు సమర్పిస్తారు.భక్తులకు ఇబ్బంది కలగకుండా అసాంఘిక సంఘటనలు జరగకుండా పోలీసు సిబ్బందిని నిర్వహిస్తారని,భక్తులు ఆంధ్ర ,తెలంగాణా, కర్ణాటక ,రాష్ట్రాలలో భారీగా తరాలివస్తారని పూజారి  తెలిపారు.ఈ మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు.మిఠాయి దుకాణాలు, ఆట వస్తువుల దుకాణాలు, గాజుల అంగల్లు ,అందరికి అందుబాటులో ఉంటాయి అని తెలిపారు. మహాశివరాత్రి వేడుకలకు కదలిరావలని పూజారి  ప్రజలకు  కోరారు.

No comments:

Post a Comment