జిల్లా కలెక్టర్ కృష్ణభాస్కర్
సిద్ధిపేట, మార్చి 02 (way2newstv.in)
ఓటు అనేది ఒక అమూల్యమైన హక్కు అని జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ చెప్పారు. జిల్లా కేంద్రం సిద్ధిపేట ఏంపీడీఓ కార్యాలయంలో శనివారం ఉదయం తెలంగాణ లోక్ సభ ఎన్నికలు -2019 కార్యక్రమంలో భాగంగా జిల్లా వ్యవసాయ శాఖ, నోడల్ అధికారి శ్రవణ్, డీడబ్ల్యూ జరీనా బేగం ఆధ్వర్యంలో దివ్యాంగులకు ఓటర్ల అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లా అధికారిక యంత్రాంగం తరపున దివ్యాంగులకు కల్పించాల్సిన సదుపాయాల విషయం పై చిత్తశుద్ధితో ఉన్నామని చెప్పారు.
ఓటు వేయడం అమూల్యమైన హక్కు
గతంతో పోల్చితే ఇప్పుడు మీకు పోలింగ్ కేంద్రాల వద్దకు చేర వేసేలా వాహన సదుపాయాల కల్పన, వీల్ చైర్స్ ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. ఓటు మన జన్మ హక్కు అని, ఓటు వినియోగం మనందరి బాధ్యత అంటూ వికలాంగులకు చక్కటి అవగాహన కల్పించారు. ఈ మేరకు ప్రజావాణిలో ప్రత్యేక క్యూ లైను ఏర్పాటు చేయాలని దివ్యాంగులు కలెక్టరును కోరగా వెంటనే ఏర్పాటు చేయించే దిశగా చర్యలు చేపట్టాలని డీడబ్ల్యూఓ జరీనా బేగంను ఆదేశించారు. అంతకు ముందు దివ్యాంగుల ప్రతినిధి మాట్లాడుతూ గత 50 ఏళ్ల కింద నుంచి ఏ ఎన్నికల కమిషన్ ఎవరు ఈ నిర్ణయం తీసుకోలేదని, ఏలాంటి లోటు పాట్లు లేకుండా మమ్మల్ని గుర్తించి మాకు సహకరించినందుకు జిల్లా కలెక్టర్ కు ధన్యవాదాలు తెలిపారు. రాజకీయాల్లో కూడా దివ్యాంగులకు రిజర్వేషన్లు కల్పించాలని కలెక్టర్ ను కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధి అధికారి ప్రశాంతి, దివ్యాంగులు తదితరులు పాల్గొన్నారు
No comments:
Post a Comment