Breaking News

13/03/2019

కృష్ణా జిల్లాలో అభ్యర్ధుల ఎంపిక పూర్తి

విజయవాడ, మార్చి 13,(way2newstv.in)
ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకి నోటిఫికేషన్ రావడంతో…రాష్ట్ర రాజకీయాలు మరింత వేడెక్కాయి. ఏప్రిల్ 11నే శాసనసభ, లోక్‌సభ ఎన్నికలు జరగనుండగా..మే 23న ఫలితాలు వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలో అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీలు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధులని అధికారికంగా ప్రకటించేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలో కృష్ణా జిల్లాలో టీడీపీ, వైసీపీ పార్టీలు…తమ అభ్యర్థుల ఎంపికను దాదాపు పూర్తి చేసింది. అయితే కొన్ని చోట్ల ఇరు పార్టీలు నుండి ఇద్దరు, ముగ్గురు పోటీ పడుతుండటంతో కొన్ని సీట్లని పెండింగ్‌లో ఉంచారు. ఇక ఈ జిల్లాలో టీడీపీ, వైసీపీ తరుపున అభ్యర్ధులు ఎవరు బరిలో ఉంటున్నారో చూద్దాం. జిల్లాలో మొత్తం 16 నియోజకవర్గాలు, 2 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి.మచిలీపట్నం నుండి ఈ సారి టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే, మంత్రి కొల్లు రవీంద్ర… మరోసారి బరిలోకి దిగుతున్నారు. అటు వైసీపీ నుండి మాజీ ఎమ్మెల్యే పేర్ని వెంకట్రామయ్య పోటీ చేస్తున్నారు. జనసేన నుండి లంకిశెట్టి బాలాజి బరిలో ఉంటారని తెలుస్తోంది. అయితే ఇక్కడ టీడీపీ, వైసీపీల మధ్యే ప్రధాన పోరు జరగనుంది. ఇక మచిలీపట్నంకి పక్కనే ఉండే పెడనలో వైసీపీ తరుపున జోగి రమేశ్ పోటీ ఖాయమైంది. ఇప్పటికే ఆయన ప్రచారం కూడా మొదలుపెట్టారు. 


కృష్ణా జిల్లాలో అభ్యర్ధుల  ఎంపిక పూర్తి

అయితే టీడీపీ తరుపున ఎంపీ కొనకళ్ళ నారాయణ పోటీ చేయడం ఖాయమని పార్టీవర్గాల్లో చర్చ నడుస్తోంది. అలాగే పెడన టికెట్ రేసులో బూరగడ్డ వేదవ్యాస్, సిట్టింగ్ ఎమ్మెల్యే కాగిత వెంకట్రావు తనయుడు కృష్ణ ప్రసాద్‌లు కూడా ఉన్నారు.ఈసారి గుడివాడలో టాఫ్ ఫైట్ జరగడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక్కడ నుండి వైసీపీ నుండి సిట్టింగ్ ఎమ్మెల్యే కొడాలి నాని పోటీ చేస్తున్నారు. ఇక కొడాలి నానిని ఢీకొట్టేందుకు ఇంతకాలం బలమైన అభ్యర్ధి కోసం వెతికిన టీడీపీ పార్టీ….దేవినేని అవినాష్‌ని బరిలోకి దించుతుంది. అటు పామర్రులో వైసీపీ నుండి కైలా అనిల్ పోటీ చేస్తుండగా…టీడీపీ తరుపున అభ్యర్ధిపై ఇంకా పూర్తి క్లారిటీ రాలేదు. మళ్ళీ టికెట్ కోసం సిట్టింగ్ ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన ప్రయత్నిస్తుండగా…మాజీ ఎమ్మెల్యే డివై దాస్ కూడా పామర్రు టికెట్ రేసులో ఉన్నారు.ఇక అవనిగడ్డ నుండి టీడీపీ తరుపున డిప్యూటీ స్పీకర్ మండలి బుద్దప్రసాద్ పోటీ చేయనున్నారు. అటు వైసీపీ నుండి సింహాద్రి రమేశ్, జనసేన నుండి ముత్తంశెట్టి కృష్ణారావు బరిలోకి దిగనున్నారు.పెనమలూరు లో టీడీపీ తరుపున బోడే ప్రసాద్, వైసీపీ నుండి కొలుసు పార్థసారథి పోటీ చేయనున్నారు. గన్నవరంలో వైసీపీ నుండి యార్లగడ్డ వెంకట్రావు, టీడీపీ నుండి వల్లభనేని వంశీ పోటీ పడుతున్నారు. ఇక విజయవాడ తూర్పులో టీడీపీ తరుపున గద్దె రామ్మోహన్, వైసీపీ నుండి యలమంచిలి రవి గాని బొప్పన రవి కుమార్ పోటీ చేసే అవకాశం ఉంది. విజయవాడ సెంట్రల్ నుండి వైసీపీ తరుపున మల్లాది విష్ణు, టీడీపీ నుండి బోండా ఉమా పోటీ పడుతున్నారు. విజయవాడ పశ్చిమలో టీడీపీ నుండి ఎమ్మెల్యే జలీల్ ఖాన్ కుమార్తె షబానా ఖాతున్, వైసీపీ నుండి వెల్లంపల్లి శ్రీనివాసరావు పోటీ చేస్తున్నారు.అటు మైలవరం నుండి మంత్రి దేవినేని ఉమా, వైసీపే నుండి వసంత కృష్ణ ప్రసాద్ బరిలో ఉన్నారు. నందిగామలో వైసీపీ తరుపున మొండితోక జగన్మోహన్ రావు, టీడీపీ నుండి ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య బరిలోకి దిగుతున్నారు. జగ్గయ్యపేట బరిలో టీడీపీకి శ్రీరాం తాతయ్య, వైసీపీకి సామినేని ఉదయభాను పోటీ చేస్తున్నారు. ఇక తిరువూరు నుండి టీడీపీ స్వామిదాస్ స్ధానంలో కొత్త అభ్యర్ధిని నిలిపే యోచనలో ఉండగా.. వైసీపీ నుండి రక్షణనిధి బరిలో ఉన్నారు.నూజివీడు నుండి వైసీపీకి మేకా ప్రతాప్ అప్పారావు, టీడీపీ తరుపున ముద్దరబోయిన వెంకటేశ్వరరావు గాని అట్లూరి రమేశ్ పోటీ చేసే అవకాశం ఉంది. కైకలూరు బరిలో వైసీపీ తరుపున దూలం నాగేశ్వరరావు బరిలో ఉండగా…టీడీపీకి మాగంటి బాబు గాని జయమంగళ వెంకటరమణ పోటీ చేయొచ్చు. ఇక మచిలీపట్నం పార్లమెంట్ స్థానం నుండి కొనకళ్ళ నారాయణ బరిలో ఉంటారు. ఒకవేళ కొనకళ్ళ పెడన అసెంబ్లీకి పోటీ చేస్తే… మాజీ ఎంపీ బాడిగ రామకృష్ణ కుమార్తె బాడిగ శ్రీదేవిని ఎంపీ అభ్యర్థిగా రంగంలోకి దించాలన్న ఆలోచనలో అధిష్ఠానం ఉంది. అటు వైసీపీ నుండి బాలశౌరి పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. విజయవాడ ఎంపీ అభ్యర్ధిగా టీడీపీ తరుపున కేశినేని నాని, వైసీపీ తరుపున జై రమేశ్ పోటీ చేయనున్నారు.

No comments:

Post a Comment