ఏపార్టీకి కనిపించని ఎడ్జ్
నెల్లూరు, మార్చి 13, (way2newstv.in)
మరో 28 రోజుల్లోనే ఎన్నికలు జరగనున్నాయి. ఏపీలో అత్యంత ప్రతిష్టాత్మకం, అత్యంత కీలకంగా మారిన ఈ ఎన్నిక లు ప్రధానంగా రెండు పార్టీల మధ్యే ఫైట్‌ను ప్రతిబింబిస్తున్నాయి. తాజాగా నిర్వహించిన సర్వేలో ఏపీలో అధికార టీడీపీ, విపక్షం వైసీపీల మధ్య భారీ ఎత్తున బిగ్ ఫైట్ ఉంటుందనే విషయం స్పష్టంగా తెలిసింది. ఆన్‌లైన్‌లో నిర్వహించిన సర్వేలో ఇరు పార్టీలకు 40 శాతానికి పైగా నెటిజన్ల మద్దతు లభించింది. ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు టీడీపీకి ఉపకరించనున్నాయి. ఇప్పటికిప్పుడు ఉన్న పరిస్థితిని అంచనా వేస్తే.. ప్రస్తుతం బాబు పాలన పట్ల ప్రజల్లో కొంత వ్యతిరేకత తగ్గింది.
సర్వేలో భాగంగా చంద్రబాబు ప్రభుత్వ పాలన ఎలా ఉందనే ప్రశ్నకు 27.2 శాతం మంది చాలా బాగుందని చెప్పగా.. 12.3 శాతం మంది బాగుందని, 13.2 శాతం మంది ఫర్వాలేదని బదులిచ్చారు. ఓవరాల్‌గా చూస్తే 52.7 శాతం మంది బాబు పాల న పట్ల సానుకూలంగా ఉన్నారు. 47.3 శాతం మంది బాబు పాలన బాగోలేదని చెప్పడం ఒకింత ఆలోచనలో పడేసే అంశం. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే సీఎంగా ఎవరిని ఎన్నుకుంటారనే ప్రశ్నకు ఎక్కువ మంది జగన్ వైపు మొగ్గు చూపారు. అయితే జగన్, బాబు మధ్య అంతరం చాలా తక్కువగా ఉంది. జగన్‌కు 40.84 శాతం మంది మద్దతు తెలపగా, చంద్రబాబుకు 40.22 శాతం మంది ఓటేశారు.
ఏపీలో హోరా హోరీయే...
పవన్ కళ్యాణ్‌కు దాదాపు 16 శాతం ఓట్లు వచ్చాయి.ఒకవేళ ఇద్దరూ కాకుండా.. హంగ్ ఏర్పడితే ఎన్నికల తర్వాత ప్రభుత్వ ఏర్పాటులో జనసేన కీలక పాత్ర పోషించే అవకా శాలున్నాయి. టీడీపీ ప్రభుత్వ అతిపెద్ద వైఫల్యం ఏంటనే ప్రశ్నకు ఏపీకి ప్రత్యేక హోదా సాధనలో విఫలం కావడమని 54.2 శాతం మంది అభిప్రాయపడ్డారు. చంద్రబాబు ప్రభుత్వం సాధించిన అతిపెద్ద విజయం ఏంటనే ప్రశ్నకు.. టీడీపీ సర్కారు సాధించిందేమీ లేదని 43 శాతం మంది బదులిచ్చారు. ఈ విషయంలో టీడీపీ పట్ల ప్రజలు అసంతృప్తితో ఉన్నారనే విషయం స్పష్టమైంది. ఏపీని ప్రగతిపథంలో నిలపడంలో బాబు విజయం సాధించారా అనే ప్రశ్నకు 49.6 శాతం మంది లేదని బదులివ్వడం గమనార్హం.అన్నదాత సుఖీభవ, పసుపు కుంకుమ, పెన్షన్ల పెంపు, నిరుద్యోగ భృతి పెంపు లాంటి సంక్షేమ పథకాలు బాబు సర్కారు పట్ల ప్రజల్లో సానుకూలతను పెంచాయి. ఈ పథకాల వల్ల వచ్చే ఎన్నికల్లో టీడీపీకి లబ్ధి చేకూరుతుందని 44.4 శాతం మంది అభిప్రాయపడ్డారు. టీఆర్ఎస్, వైఎస్ఆర్సీపీ చెలిమి టీడీపీ ఓటు బ్యాంకుపై ప్రతికూల ప్రభావం చూపుతుందా అనే ప్రశ్నకు 41.8 శాతం మంది ప్రతికూలం కాబోదని చెప్పడం విశేషం. 40.5 శాతం మంది ప్రతికూల ప్రభావం చూపుతుందని అభిప్రాయపడ్డారు. ప్రత్యేక హోదాపై చంద్రబాబు వైఖరి సమర్థనీయం కాదని 55.1 శాతం మంది స్పష్టం చేశారు. 37.1 శాతం మంది మాత్రమే ఈ విషయంలో బాబుకు మద్దతుగా నిలిచారు. ఇలా మొత్తంగా చూసుకుంటే.. ఇరు పక్షాల మధ్య బిగ్ ఫైట్ హోరా హోరీగా సాగే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
No comments:
Post a Comment