విజయవాడ, మార్చి 12, (way2newstv.in)
ఏపీలో ఎలక్షన్ తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు హీటెక్కాయి. ప్రభుత్వ అధికారం కోసం ప్రధానంగా వైసీపీ-టీడీపీ మధ్యనే పోరు జరగనుందని నిర్వివాదాంశం. రాష్ట్ర విభజన అనంతరం అనుభవజ్ఞుడైన చంద్రబాబు వైపే ప్రజలు నిలవగా ఈ సారి మాత్రం జగన్ పార్టీకి జనం మద్దతు ఉంటుందన్న కోణంలో ఇప్పటికే పలు జాతీయ మీడియా సంస్థలు సర్వేలను వెల్లడించాయి. అయితే సర్వేలు వెల్లడైన సమయంలో వైసీపీపై పెద్దగా ఆసక్తి చూపని టీడీపీ నేతలు ఒక్కరొక్కరుగా ఆ పార్టీ కండువా కప్పుకోవడం మొదలుపెడుతున్నారు. ఈ క్రమంలోనే అమలాపురం ఎంపీ పండుల రవీంద్రబాబు, అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్, నిన్నటి వరకు నరసాపురం లోక్‌సభ నియోజకవర్గ సమన్వయకర్తగా ఉన్న రఘురామ కృష్ణంరాజు వైసీపీలో చేరిపోయారు. ఇక రాజమహేంద్రవరం నుంచి మురళీమోహన్, నరసరావుపేట నుంచి రాయపాటి బరిలో ఉండమని ఇప్పటికే అధిష్ఠానానికి తేల్చిచెప్పారు. కాకినాడ ఎంపీ తోట నర్సింహులు వైసీపీలో చేరుతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది.
నాయకుల్లో టెన్షన్ అటెన్షన్
ఆయన కూడా వైసీపీ నేతలతో టచ్‌లో ఉన్నట్లు సమాచారం. ఆయన ఎప్పుడోకప్పుడు గోడ అయితే దూకడం ఖాయమన్న అభిప్రాయంలోనే ఆ పార్టీ అధినాయకత్వమే అంగీకరిస్తున్న వాస్తవం. ఇలా టీడీపీకి చెందిన కొంతమంది కీలక నేతలు వైసీపీ తీర్థం పుచ్చుకోవడమో లేదా.. ఎన్నికలకు దూరంగా ఉండటమో చేస్తుండటం ఆ పార్టీకి శరాఘాతంలా మారింది. చూస్తుంటే సర్వే సారాంశమే నిజమవుతుందేమోనన్న అనుమానాలు ఇటు జనంలో అటు రాజకీయ వర్గాల్లో నెలకొని ఉండటం విశేషం.నాయకుల చేరికతో వైసీపీ పట్టుబిగిస్తుంటే..టీడీపీ మాత్రం కొంత ఆందోళనలో ఉన్న మాట మాత్రం వాస్తవం. అయితే సీట్ల కేటాయింపు నాటికి తిరిగి కొంత మంది వైసీపీ నేతలు టీడీపీలో చేరితే మళ్లీ బలాబలాలు బ్యాలెన్స్ అవుతాయన్న విశ్లేషణ ప్రచారంలో ఉంది. కొన్నిచోట్ల వైసీపీ బలం పెరిగితే మరికొన్ని చోట్ల తగ్గి టీడీపీ పుంజుకుంటోందన్న వాదన ఉంది. రాజకీయ వాతావరణంలో మార్పులు సహజమని…టికెట్ల కేటాయింపు తర్వాత సద్దమణగడం సర్వసాధారణమని కొట్టిపారేస్తున్న వారు ఉన్నారు. టీడీపీ నేతలు పార్టీ మారడం…లేక పోటీకి దూరంగా ఉండటం మాత్రం ఆ పార్టీకి కొంత ఇబ్బందికరమైన పరిస్థితులనే తెచ్చిపెడుతుందని, వైసీపీ అనుకూల వాతావరణ ఉందని రాజకీయ విశ్లేషకులు చెప్పకనే చెబుతున్నారు. పోతున్న నాయకులతో టీడీపీలో టెన్షన్ క్రియేట్ అయితే.. వచ్చి చేరుతున్న నాయకులతో వైసీపీలో టికెట్ కోసం అటెన్షన్ మొదలైంది.
No comments:
Post a Comment