Breaking News

30/03/2019

బీహార్ లో ఇంటిపోరు

పాట్నా, మార్చి 30 (way2newstv.in)
లోక్‌సభ ఎన్నికల తేదీ సమీపిస్తున్న వేళ బీహార్‌ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. సీట్ల పంపిణీ విషయంలో కాంగ్రెస్-ఆర్జేడీ మధ్య ఇంకా ఏకాభిప్రాయం కుదరకపోగా...అటు ఆర్జేడీలో ఇంటి పోరు వీధికెక్కింది. పార్టీ అభ్యర్థులకు సీట్ల పంపిణీ విషయంలో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ తనయులు తేజ్ ప్రతాప్, తేజస్విని యాదవ్ మధ్య విభేదాలు నెలకొన్నట్లు తెలుస్తోంది. తన మద్దతుదారులు ఇద్దరికి లోక్‌సభ ఎన్నికల్లో టిక్కెట్లు ఇవ్వాలని తేజ్ ప్రతాప్ డిమాండ్ చేస్తున్నారు. సీట్లు ఇవ్వని పక్షంలో కొన్ని సీట్లలో తన మద్దతుదారులను బరిలో నిలపనున్నట్లు తేజ్ ప్రతాప్ స్పష్టంచేసినట్లు తెలుస్తోంది. 


బీహార్ లో ఇంటిపోరు

అన్నదమ్ముల మధ్య సీట్ల పంచాయితీ ఎక్కడి వరకు వెళ్తుందోనన్న ఆసక్తి రాజకీయ వర్గాల్లో నెలకొంటోంది.తేజ్ ప్రతాప్ తన మద్దతుదారులను ఎన్నికల బరిలో నిలిపితే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలిపోయి బీజేపీ-జేడీయు కూటమికి కలిసొచ్చే అవకావముంది. ఇదే కనుక జరగితే కాంగ్రెస్-ఆర్జేడీ కూటమి తీవ్రంగా నష్టపోవాల్సి ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.అటు కాంగ్రెస్-ఆర్జేడీ మధ్య సీట్ల పంచాయితీ ఇంకా తేలలేదు. దీంతో కాంగ్రెస్ పార్టీలో సినీ నటుడు శత్రుఘ్న సిన్హా ఎంట్రీ ఆలస్యమవుతోంది. సీట్ల విషయంలో క్లారిటీ వచ్చిన తర్వాతే శత్రుఘ్న సిన్హా కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ముందుగా నిర్ణయించిన మేరకు అయితే ఇవాళ ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరాల్సి ఉండగా...ఇది వాయిదాపడింది.

No comments:

Post a Comment